PUSHPA: ‘తగ్గేదే లే’.. అంతకంతకూ పెరుగుతోన్న ‘పుష్ప’ క్రేజ్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(AlluArjun) నటించిన ‘పుష్ప’కు(Pushpa) క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రానికి ఇప్పటికే దేశవిదేశాల్లోని..

Updated : 01 Jul 2022 13:29 IST

హైదరాబాద్‌: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(AlluArjun) నటించిన ‘పుష్ప’(Pushpa) చిత్రానికి క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమాకు ఇప్పటికే దేశవిదేశాల్లోని పలువురు ప్రముఖులు అభిమానులుగా మారగా.. తాజాగా ఓ రెజ్లర్‌ ఫిదా అయ్యారు. రెజ్లింగ్‌ రింగ్‌లోకి దిగి ‘తగ్గేదే లే’ అంటూ బన్నీ(Bunny) మేనరిజాన్ని చేసి చూపించారు. దీనికి సంబంధించిన వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ రెజ్లర్‌ ఎవరంటే..?

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ప్రముఖ రెజ్లర్‌ సౌరవ్ గుర్జార్ (Saurav Gurjar). గత కొంతకాలంగా ఆయన ‘డబ్ల్యూడబ్ల్యూఈ’(WWE)లో తలపడుతున్నారు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో ప్రత్యర్థితో పోటీపడుతూ ‘తగ్గేదే లే’ మేనరిజాన్ని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ వీడియోని ఆయన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసి అల్లు అర్జున్‌ని ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘‘పుష్పరాజ్‌ క్రేజ్‌ అంతకంతకూ పెరుగుతోందిగా’’ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో దర్శకుడు సుకుమార్‌ (Sukumar) ‘పుష్ప’ చిత్రాన్ని తెరకెక్కించారు. పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ ఒదిగిపోయారు. కథానాయిక రష్మిక.. శ్రీవల్లిగా సందడి చేసింది. సునీల్‌, అనసూయ, ఫహద్‌ ఫాజిల్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా గతేడాది డిసెంబరులో విడుదలై, రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కనుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని