Updated : 05 Oct 2021 20:02 IST

Yami Gautham: ఆ విషయం ఓపెన్‌గా చెబితే తప్పేముంది?

       నాకు ఆ చర్మసమస్య ఉంది..  అందుకే ముఖంపై ఇలా

ముంబయి: ‘‘మెరిసేదంతా బంగారం కాదు’’ అన్నట్టు తెరపై మేము అందంగా కనిపించినప్పటికీ.. మాకు చర్మ సమస్యలుంటాయి. ఇన్నాళ్లు నేను ఆవిషయాన్ని బయటపెట్టకపోయినప్పటికీ.. ఇప్పుడు ఒప్పుకుంటున్నా’’ అని వెల్లడించింది బాలీవుడ్‌ హీరోయిన్‌ యామీ గౌతమ్‌. గతంలో ఈ భామ ఓ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు. సినిమాలతో యామీ ప్రేక్షకులకు ఎంత చేరువయ్యారో.. ఆ యాడ్ కూడా ఆమెకు అంతే గుర్తింపు తెచ్చిపెట్టింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాను ఓ చర్మసమస్యతో బాధపడుతున్నట్టు వివరించింది యామీ. ‘‘ హలో అందరికీ! అవును.. నేను కెరాటోసిస్-పిలారిస్ అనే చర్మసమస్యతో బాధపడుతున్నా. నేను ఇక్కడ పోస్ట్‌ చేసిన నా క్లోజ్‌అప్‌ చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే..  నా శరీరంపై ఎర్రటి మచ్చలను గమనించొచ్చు. సాధారణంగా మేము ఎక్కువగా మేకప్ వేసుకొనే కనిపిస్తుంటాం. అందుకే మా ముఖంపై ఉండే మచ్చలు మీకు కనిపించవు. కానీ నాకూ చర్మసమస్య ఉంది’’ అని యామీ తెలిపింది.   

ఫొటోలు ఎడిట్‌ చేయడం ఎందుకు.. నిజం చెప్పాలనిపించింది

‘‘ఈ మధ్యే నేను ఓ ఫొటో షూట్‌లో పాల్గొన్నా. ఆ ఫొటోస్‌లో నా చర్మంపై ఉన్న మచ్చలు కనిపించకుండా ఉండేందుకు ఫొటోగ్రాఫర్స్‌ ఎడిటింగ్‌ చేస్తున్నప్పుడు... నాకో విషయం మనసులో అనిపించింది. ‘‘ ముఖం పై మచ్చలు ఉంటే అందంగా లేమని కాదు కదా! నేను ఎందుకు ఈ విషయాన్ని దాచాలి. ఇట్స్‌ ఒకే. ఈ నిజాన్ని నేను అంగీకరించడంలో తప్పులేదు ’’ అనుకున్నా. నిజానికి కొన్ని విషయాల్లో నాలో నేనే ఇలా గట్టిగా మాట్లాడుకుంటాను’’ అని యామీ గౌతమ్‌ చెప్పుకొచ్చింది.  

టీనేజీ నుంచే ఇది ఉంది
‘‘కెరాటోసిస్-పిలారిస్ వ్యాధి వస్తే.. చర్మం మీద ఎర్రటి చిన్నచిన్న గడ్డలు ఏర్పడతాయి. ఇప్పటి వరకూ దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనలేదు. టీనేజీ నుంచి నాకీ సమస్య ఉంది. సాధారణంగా ఇలాంటి ఫొటోలను కానీ, వ్యక్తిగత విషయాలను కానీ పబ్లిక్‌గా చెప్పకునేందుకు చాలా మంది ఇష్టపడరు. కాకపోతే మీ ఇంటి పక్కనుండే ఆంటీలు చెప్పుకునే విషయాలతో పోలిస్తే ఇది చెప్పడమనేది అంత పెద్ద విషయం కాదనుకోండి. మొత్తానికి నాలోని భయాలను ఈరోజు ఇలా మీతో చెబుతున్నా. నా ‘లోపాలను’ హృదయపూర్వకంగా ప్రేమించి అంగీకరించాను. ఈ నిజాన్ని మీతో పంచుకునే ధైర్యం నాకొచ్చింది. ఇకపై వీటన్నింటిని కప్పిపుచ్చాలని అనుకోవడం లేదు. ఏదైమైనా నేను అందంగానే ఉన్నా’’ అని యామీ వివరించింది. 

నివేతా థామస్‌ కూడా..

వ్యక్తిగత విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునే టాలీవుడ్‌ హీరోయిన్‌ నివేదా థామస్ సైతం.. తనకు ‘కెరాటోసిస్’ చర్మ సమస్య ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. భుజంపై మచ్చలు కనిపిస్తున్న ఫొటోను పోస్ట్‌ చేశారు.

 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని