KGF 2: ‘కేజీయఫ్‌-2’కి డైలాగ్స్‌ రాసిన స్టార్‌ హీరో

‘వైలెన్స్‌.. వైలెన్స్‌.. వైలెన్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌.. బట్‌.. వైలెన్స్‌ లైక్స్‌ మీ’’.. ఇప్పుడు ‘కేజీయఫ్‌’ ప్రేమికులందరూ చెబుతున్న డైలాగ్‌ ఇది. యశ్‌-ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో సిద్ధమైన ‘కేజీఎఫ్‌-2’లోనిది ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌. సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన...

Updated : 31 Mar 2022 12:43 IST

ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన ప్రశాంత్‌నీల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘వైలెన్స్‌.. వైలెన్స్‌.. వైలెన్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌.. బట్‌.. వైలెన్స్‌ లైక్స్‌ మీ’’.. ఇప్పుడు ‘కేజీయఫ్‌’ ప్రేమికులందరూ చెబుతున్న డైలాగ్‌ ఇది. యశ్‌-ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో సిద్ధమైన ‘కేజీయఫ్‌-2’లోనిది ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌. సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన ‘కేజీయఫ్‌’కు సీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘కేజీయఫ్‌-2’ ట్రైలర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ప్రథమ స్థానంలో దూసుకెళ్తోంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లు, నటీనటుల సంభాషణలు.. ముఖ్యంగా హీరో చెప్పే డైలాగ్‌లు అందరితో ఈలలు వేయిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ‘కేజీయఫ్‌-2’కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో యశ్‌ మెయిన్‌ రోల్‌ పోషించడమే కాకుండా తనలోని రైటింగ్‌ టాలెంట్‌నీ బయటపెట్టారు. తన పాత్రకు సంబంధించిన పలు సంభాషణలను యశే రాసుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రశాంత్‌నీల్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘కేజీయఫ్‌-2’ ట్రైలర్‌ చూసిన చాలా మంది డైలాగ్స్‌ పవర్‌ఫుల్‌గా ఉన్నాయని చెబుతున్నారు. యశ్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ బాగున్నాయని చెబుతున్నారు. అయితే, తన పాత్రకు సంబంధించిన చాలా డైలాగ్స్‌ని యశ్‌నే రాసుకున్నారు’’ అని ప్రశాంత్‌నీల్‌ చెప్పారు. దీంతో యశ్‌ అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని