Yash: యశ్ ఇంటి వద్ద బారులు తీరిన అభిమానులు.. వీడియోలు వైరల్
కన్నడ నటుడు యశ్‌ను కలిసేందుకు చాలామంది అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. వారితో యశ్ ఫొటోలు దిగారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘కేజీయఫ్’ (KGF) ఛాప్టర్ 1, ఛాప్టర్ 2 చిత్రాలతో జాతీయ స్థాయిలో హీరోగా గుర్తింపు పొందారు కన్నడ నటుడు యశ్ (Yash). ఆయనను చూడాలని, కలవాలనే ఆశతో ఇటీవల వందలమంది యశ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆయనతో ఫొటో దిగేందుకు క్యూలో నిలబడ్డారు. అభిమానుల్ని నిరాశ పరచకూడదని భావించిన యశ్ ప్రతి ఒక్కరితో ఫొటోలు దిగారు. తమ కల నెరవేరడంతో పలువురు సంబంధిత విజువల్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
గతేడాది విడుదలైన ‘కేజీయఫ్ 2’ తర్వాత యశ్ మరో చిత్రాన్ని ప్రకటించలేదు. ఆయన సినిమా అప్‌డేట్ కోసం కన్నడ ప్రేక్షకులతోపాటు తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న యశ్ ఆ తీపి కబురు చెబుతారని ఊహించిన వారందరికీ నిరాశే ఎదురైంది. ‘‘నేను ఓ క్రేజీ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా పనిచేస్తున్నా. ప్రస్తుతానికి దాని వివరాలు చెప్పలేను. ఓపిక పట్టండి. మిమల్ని నిరాశపరచను’’ అని ఆయన ట్వీట్ చేశారు. దాంతోపాటు ‘నేను ప్రస్తుతం ఇక్కడ (కర్ణాటక)లేను. మిమల్మి కలుసుకోలేను’ అని అభిమానులకు చెప్పారు. యశ్ విదేశాల నుంచి తిరిగి వచ్చారనే సమాచారం తెలుసుకుని దేశం నలుమూలల నుంచి అభిమానులు వచ్చారని కన్నడ సినీ వర్గాల టాక్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
బీసీసీఐ గ్రేడ్స్‌లో రాహుల్ కిందికి
-
India News
Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!
-
Sports News
IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
-
Movies News
SS Karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Madhyapradesh: 200కు పైగా సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారం మాదే..: నడ్డా
-
India News
Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్!