KGF 2: కేజీఎఫ్‌-2.. ప్రమాదం ముందుంది..!

కన్నడ స్టార్‌ యశ్‌ని (Yash) కోట్లాదిమంది సినీ ప్రియులకు దగ్గర చేసిన చిత్రం ‘కేజీఎఫ్‌’ (KGF). ఇప్పుడే అదే చిత్రానికి పార్ట్‌-2 తెరకెక్కిన విషయం తెలిసిందే. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గతేడాదిలోనే ప్రేక్షకుల...

Published : 08 Jan 2022 10:48 IST

రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్‌ చేసిన చిత్రబృందం

బెంగళూరు: కన్నడ స్టార్‌ యశ్‌ని (Yash) కోట్లాదిమంది సినీ ప్రియులకు దగ్గర చేసిన చిత్రం ‘కేజీఎఫ్‌’ (KGF). చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పార్ట్ 2 గతేడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా అనేక పర్యాయాలు వాయిదా పడింది. ఈ క్రమంలోనే వేసవి కానుకగా ఈఏడాది ఏప్రిల్‌ 14న ‘కేజీఎఫ్‌-2’ (KGF 2)ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం గతేడాది ప్రకటించింది. ఈ నేపథ్యంలో శనివారం యశ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని చిత్రబృందం స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘కేజీఎఫ్‌-2’ (KGF 2) సరికొత్త పోస్టర్‌ విడుదల చేసింది. ‘‘గమనిక: ప్రమాదం ముందుంది’’ అని పేర్కొంటూ షేర్‌ చేసిన ఈ పోస్టర్‌లో ఏప్రిల్‌ 14నే చిత్రాన్ని విడుదల చేస్తామని మరోసారి అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘కేజీఎఫ్‌’కు ప్రీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమైంది. ఈ చిత్రానికి ప్రశాంత్‌నీల్‌ (Prasanth Neel) దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘అధీరా’ పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని అలరించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, టాలీవుడ్‌ నటుడు రావు రమేష్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని