Yash: ‘కేజీయఫ్‌-2’ వర్సెస్‌ ‘బీస్ట్‌’.. యశ్‌ ఆసక్తికర కామెంట్స్‌

‘కేజీయఫ్‌-1’తో ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు సొంతం చేసుకున్న కన్నడ స్టార్‌హీరో యశ్‌. బంగారు గనుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘కేజీయఫ్‌’కు సీక్వెల్‌గా ‘కేజీయఫ్‌-2’ రానుంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా...

Updated : 11 Apr 2022 13:55 IST

తిరుపతి: ‘కేజీయఫ్‌-1’తో ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు సొంతం చేసుకున్న కన్నడ స్టార్‌హీరో యశ్‌. బంగారు గనుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీయఫ్‌-2’ రానుంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యశ్‌ పాల్గొన్నారు.

‘తిరుపతి పుణ్య క్షేత్రానికి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. కర్ణాటక-ఆంధ్రాల మధ్య అనుబంధం ఎంతో ప్రత్యేకం. మన సంప్రదాయాలు, లిపి కాస్త ఒకేలా ఉంటాయి. కన్నడవాళ్లు తెలుగు కూడా చదవగలరు. మమ్మల్ని మీరు ఇంతలా ఆదరిస్తారని అస్సలు ఊహించలేదు. ‘కేజీయఫ్‌‌’ ముందు కూడా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు నా చిత్రాల్ని ఆదరించేవాళ్లు. నన్ను అభిమానిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా తెలుగులో ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి’’ అని యశ్‌ తెలిపారు.

‘కేజీయఫ్‌’ పార్ట్‌ 3 ఉంటుందా?

యశ్‌: ముందు పార్ట్‌-2 చూడండి. దీన్ని ఎంజాయ్‌ చేయండి. నేను మళ్లీ తిరుపతి వస్తా. తప్పకుండా అప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం.

‘బీస్ట్‌’ వర్సెస్‌ ‘కేజీయఫ్‌’..  దానిపై మీరు ఏం చెబుతారు? 

యశ్‌: పుణ్యక్షేత్రంలో ఉన్నాం. అందరికీ విజయమే రావాలని కోరుకుందాం.

‘కేజీయఫ్‌’తో మీకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది కదా..!

యశ్‌: అవును. ఫ్యాన్స్‌ నా నుంచి మరిన్ని మంచి చిత్రాలు కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ల నమ్మకాన్ని నిజం చేయడానికి ఇంకా ఎక్కువగా కష్టపడాలనుకుంటున్నా. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి మల్టీస్టారర్‌ చేస్తారా?

యశ్‌: మంచి డైరెక్టర్‌, స్క్రిప్ట్‌ దొరికితే తప్పకుండా చేస్తా.

ఊరమాస్‌ చిత్రాలే చేస్తారా?

యశ్‌: అన్ని రకాల చిత్రాలు చేస్తాను. కానీ, మాస్‌లోనే ఒక క్లాస్‌ ఉంటుందని నేను నమ్ముతాను. 

‘కేజీయఫ్‌-2’లో మీ రోల్‌ ఎలా కనిపించనుంది?

యశ్‌: ఈ కథలో మరింత ఎలివేషన్‌ ఉంటుంది. పార్ట్‌-1కి దీనికి చాలా తేడా ఉంటుంది. మొదటి పార్ట్‌ చూసుకుంటే ‘నరాచీ’లో నేను కేవలం హావభావాలతోనే కమ్యూనికేట్‌ అవుతాను. కానీ ఇందులో నాకు నటించడానికి చాలా ఛాన్స్‌ ఉంది.

స్ట్రైట్‌ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు?

యశ్‌: ఇది కూడా స్ట్రైట్‌ తెలుగు సినిమానే. టీమ్‌లో చాలామంది తెలుగు మాట్లాడేవాళ్లు ఉన్నారు. మా రచయితల్లో హనుమాన్‌ అనే ఒక తెలుగాయన ఉన్నారు. అదీకాక ఇప్పుడు అన్ని భాషల వాళ్లు కలిసి సినిమాలు చేస్తున్నారు. అలా, నాక్కూడా ఏదైనా కథలో అవకాశం వస్తే తప్పకుండా చేస్తా.

ఈ సినిమాలో మథర్‌ సెంటిమెంట్‌ ఉంటుందా?

యశ్‌: ‘కేజీయఫ్‌’తో పోలిస్తే ఇందులో మథర్‌ సెంటిమెంట్‌ ఇంకా ఎక్కువగా ఉంటుంది. పార్ట్‌-2లో అదే ముఖ్యమైనది. నన్ను అడిగితే ‘కేజీయఫ్‌’ అంటే తల్లికొడుకుల అనుబంధాన్ని చెప్పే సినిమా. 

‘బాహుబలి-2’ కలెక్షన్స్‌ని ‘కేజీఎఫ్‌-2’ బీట్‌ చేస్తుందా?

యశ్‌: అలా చేస్తే మంచిదే కదా. ఒక సినిమా క్రియేట్‌ చేసిన రికార్డ్స్‌ దాని తర్వాత వచ్చే చిత్రాలు బ్రేక్‌ చేయాలి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. అలా జరిగితేనే ప్రోగ్రెస్‌ ఉంటుంది. రికార్డ్స్‌ కూడా ఇంఫ్రూవ్‌ అవుతూ ఉంటాయి.

సౌత్‌ ఇండియా సినిమాలు ఉత్తరాదిలోనూ మంచి ఫేమ్‌ సొంతం చేసుకుంటున్నాయి..! 

యశ్‌: కంటెంట్‌+టెక్నిషియన్స్‌ వర్క్‌ చూసి నార్త్‌ ప్రేక్షకులు కూడా మన చిత్రాలను మెచ్చుకోవడం ప్రారంభించారు. రాజమౌళి చిత్రాలతోనే అది మొదలైంది. అందుకు మనందరం గర్వపడాలి. ఇలా జరగడం వల్ల వివిధ భాషలకు చెందిన నటీనటులందరూ ఒకే తాటిపైకి వచ్చి మరిన్ని చిత్రాలు తెరకెక్కించగలుగుతున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని