Yash: కేజీఎఫ్ హీరోకు బాలీవుడ్ నుంచి రెండు మెగా ఆఫర్లు..!
కేజీఎఫ్-2 సినిమా తర్వాత యశ్ తన తర్వాత ప్రాజెక్టు గురించి ప్రకటన చేయలేదు. బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు నిర్మాతలు యశ్‌ను సంప్రదించినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: కేజీయఫ్(KGF).. ఈ సినిమా ఓ ప్రభంజనం. విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచి వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో యశ్(Yash). రాఖీభాయ్‌గా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తర్వాతి సినిమా గురించి అందరూ చర్చించుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం యశ్‌తో సినిమా తీయాలని బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. హిందీ చిత్రపరిశ్రమ నుంచి రెండు మెగా ఆఫర్లు వచ్చాయని టాక్.
బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా(Rakeysh Omprakash Mehra) మహాభారతం ఆధారంగా ‘కర్ణ’(Karna) అనే పౌరాణిక ఇతిహాసాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం చిత్రబృందం యశ్‌ను సంప్రదించిందిట. అలానే బ్రహ్మాస్త్ర-2(Brahmastra 2) కోసం ఆ సినిమా నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల యశ్‌ని కలిశారట. అందులోని దేవ్ పాత్రలో నటించాల్సిందిగా కోరినట్లు సమాచారం. అయితే ఈ రెండు ప్రాజెక్టుల్లో యశ్ ఏ సినిమాకు ఓకే అంటారో ఇంకా తెలియలేదు. యశ్ పుట్టినరోజు(జనవరి 8) నాటికైనా వీటికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Atlee: ‘రాజారాణి’ టు ‘జవాన్’.. నేనెంతో గర్వపడుతున్నా: అట్లీ సతీమణి పోస్ట్
-
Airtel: ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ రూ.2.81 కోట్ల జరిమానా
-
Gold Robbery: రూ.25 కోట్ల నగల చోరీ కేసులో కీలక పురోగతి
-
IPO: ఐపీఓకు క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దరఖాస్తు
-
Crime: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని.. నిప్పంటించిన తల్లి, సోదరుడు
-
ICC World Cup: వరల్డ్ కప్ లక్ష్యంగా.. ‘ఖలిస్థానీ ఉగ్రవాది’ పన్నూ బెదిరింపులు..!