Yash Puri: ఓ కొత్త భాషను సృష్టించాం!
‘‘పరాయి భాషను గౌరవిద్దాం.. మాతృభాషను ప్రేమిద్దాం’ అని బలమైన సందేశమిచ్చే సినిమా ‘చెప్పాలని ఉంది’.
‘‘పరాయి భాషను గౌరవిద్దాం.. మాతృభాషను ప్రేమిద్దాం’ అని బలమైన సందేశమిచ్చే సినిమా ‘చెప్పాలని ఉంది’ (Cheppalani undhi). ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు యష్ పూరి (Yash Puri). ఆయన్ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన చిత్రమే ‘చెప్పాలని ఉంది’. అరుణ్ భారతి.ఎల్ దర్శకత్వం వహించారు. స్టెఫీ పటేల్ కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు యష్ పూరి.
* ‘‘చిత్ర ఉపశీర్షికలో చెప్పినట్లు ఒక మాతృభాష కథ ఇది. ఈ చిత్రంలో నేను జర్నలిస్ట్‌గా కనిపిస్తాను. అకస్మాత్తుగా వేరే భాషలో మాట్లాడుతుంటా. అది ఎవరికీ అర్థం కాదు. దాని వల్ల సమస్యలు ఎదుర్కొంటా. నా దగ్గర వాళ్లు దూరమవుతారు. నాకు ఏదో చెప్పాలని ఉంటుంది కానీ, చెప్పలేకపోతుంటా. అందుకే దీనికి ‘చెప్పాలని ఉంది’ అనే పేరు పెట్టాం. మరి ఆ వేరే భాష నాకు ఎందుకు వచ్చింది? దాని వల్ల ఎదురైన సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి’’.
* ‘‘ఈ చిత్రానికి మొదటి హీరో కథే. వినోదం, డ్రామా, యాక్షన్, రొమాన్స్.. ఇలా అన్ని రకాల వాణిజ్య హంగులు ఇందులో చాలానే ఉన్నాయి. సినిమాలో ప్రతి పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఈ చిత్రం కోసం కొరియన్ భాష శైలిలో ఓ కొత్త భాషని సృష్టించాం. అది ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా స్క్రిప్ట్‌లో పెట్టాం. ఈ భాష నేర్చుకోవడానికి నాకు 15రోజులు పట్టింది’’.
* ‘‘మాది హైదరాబాదే. మొదట్లో క్రికెటర్ కావాలనుకున్నా. హైదరాబాద్ తరపున రంజీ ట్రోఫీ జట్టు ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నా. కొన్ని కారణాల వల్ల ఆటకు దూరమయ్యాక సినిమాలతో ప్రేమలో పడ్డాను. అన్నపూర్ణలో ‘అలాంటి సిత్రాలు’ చిత్రంలో అవకాశం దక్కించుకున్నా. ఇప్పుడిలా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా హీరోగా పరిచయమవుతున్నా. ప్రస్తుతం సిల్లీ మాంక్ సంస్థలో ఓ చిత్రం చేస్తున్నా’’.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా