Yash: ఈ హీరోలకు నేను వీరాభిమానిని..: కేజీయఫ్‌ స్టార్‌ యశ్‌

రాకీభాయ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో యశ్‌. యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఈ కేజీయఫ్‌ స్టార్‌ తనకు ఇష్టమైన హీరోల గురించి వివరించాడు.

Published : 07 Nov 2022 14:02 IST

హైదరాబాద్‌: కేజీయఫ్‌(KGF) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు యశ్‌(Yash). ‘రాకీ భాయ్‌’గా సినీ ప్రియుల మదిలో చెరగని ముద్రవేసుకున్నాడు. సినీ నేపథ్యం లేకపోయినా స్టార్‌గా పాన్‌ఇండియా స్థాయికి ఎదిగి.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మరి ఈ హీరోకు ఎవరు స్ఫూర్తినిచ్చారో తాజాగా ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

‘‘నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను. అందుకే రాకీభాయ్‌ పాత్ర నాది అని నేను చెప్పలేను.. ఎందుకంటే నేను చూసిన ఏ సినిమా అయినా నన్ను  బాగా ప్రభావితం చేస్తుంది. నేను ఓ విలేకరి పాత్రలో నటించాల్సి వస్తే.. వాళ్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాను. వాళ్ల హావభావాలు, బాడీ లాంగ్వేజీ అన్ని గమనిస్తాను. నా విషయానికొస్తే నాకు చాలామంది రోల్‌మోడల్స్‌ ఉన్నారు. శంకర్‌ నాగ్‌, అంబరీష్‌, రాజ్‌కుమార్‌, అమితాబ్‌ బచ్చన్(Amitabh Bachchan)‌, రజనీకాంత్(Rajinikanth)‌, కమల్‌హాసన్‌(Kamal Haasan).. ఇలా చాలామంది నటులకు నేను వీరాభిమానిని. వీళ్లందరిలో రజనీకాంత్‌ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన నన్ను ఎంతో ప్రభావితం చేశారు’’ అని తెలిపాడు యశ్‌.

ఈ కేజీయఫ్‌ స్టార్‌ తనకు ఇష్టమైన హీరోలపై ఉన్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉంటాడు. కేజీయఫ్‌-2 సినిమాకు ముందు యశ్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘కమల్‌ హాసన్‌ నటన భగవద్గీత, రజనీకాంత్‌ సర్‌ నాకు దేవుడు.. ఆయన మా తలైవా" అని చెప్పిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని