KGF 2: ముందుంది ప్రమాదం

యష్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ చిత్రం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌2’. విజయ్‌ కిరగందుర్‌ నిర్మించారు. శ్రీనిధి శెట్టి కథా నాయిక. సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శనివారం యష్‌ పుట్టినరోజు

Updated : 09 Jan 2022 06:54 IST

యష్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ చిత్రం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌2’. విజయ్‌ కిరగందుర్‌ నిర్మించారు. శ్రీనిధి శెట్టి కథా నాయిక. సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శనివారం యష్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా నుంచి కొత్త లుక్‌ విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో యష్‌.. రాఖీభాయ్‌గా సీరియస్‌ లుక్‌తో ఆకట్టుకునేలా కనిపించారు. ‘‘హెచ్చరిక.. ముందు ప్రమాదముంది’’ అంటూ  పోస్టర్‌పై ఓ వ్యాఖ్యను జోడించారు. ఈ లుక్‌ ద్వారా సినిమాని ఏప్రిల్‌ 14నే విడుదల చేయనున్నట్లు మరోసారి అధికారికంగా ప్రకటించారు. ‘కేజీఎఫ్‌’కు సీక్వెల్‌గా రూపొందిన చిత్రమిది. సంజయ్‌ దత్‌ ఈ సినిమాలో అధీరా అనే శక్తిమంతమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్‌, ఛాయాగ్రహణం: భువన్‌ గౌడ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు