Yash: యశ్‌ వేస్తున్న ‘గూగ్లీ’

‘కేజీఎఫ్‌’ భారీ విజయాల తర్వాత కథానాయకుడు యశ్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఆయన పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తను నటించిన పాత సినిమాల్ని వరుసపెట్టి రీమేక్‌ చేస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు ‘గూగ్లీ’ చేరబోతోంది.

Updated : 21 Jul 2022 07:39 IST

‘కేజీఎఫ్‌’ (KGF) భారీ విజయాల తర్వాత కథానాయకుడు యశ్‌ (Yash) క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఆయన పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తను నటించిన పాత సినిమాల్ని వరుసపెట్టి రీమేక్‌ చేస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు ‘గూగ్లీ’ (Googly) చేరబోతోంది. ఈ రొమాంటిక్‌ కామెడీ సినిమా హక్కుల్ని నిర్మాత మహేష్‌ దనన్నవార్‌ దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని హిందీతోపాటు ఇతర భాషల్లో పునర్నిర్మించనున్నట్టు తాజాగా ప్రకటించారు. ‘నాకు కన్నడ పరిశ్రమతో మంచి సంబంధాలున్నాయి. యశ్‌ కేజీఎఫ్‌ చిత్రాలకు భిన్నంగా ఇందులో రొమాంటిక్‌గా కనిపించారు. కన్నడలాగే రీమేక్‌ చిత్రాన్ని ఇతర భాషా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారని భావిస్తున్నా. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తా’ అన్నారు. 2013లో వచ్చిన ఈ చిత్రంలో కృతి కర్బందా కథానాయిక.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని