KGF2: ‘కేజీఎఫ్‌-2’లో మాటలు రాసి..!

‘‘వైలెన్స్‌.. వైలెన్స్‌.. వైలెన్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌. బట్‌.. వైలెన్స్‌ లైక్స్‌ మీ’’ అంటూ ‘కె.జి.ఎఫ్‌-2’ ట్రైలర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు కథానాయకుడు యశ్‌. ఆయన హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రమే ‘కేజీఎఫ్‌2’. రెండేళ్ల క్రితం విడుదలైన ‘కేజీఎఫ్‌’కు కొనసాగింపుగా రూపొందింది.

Updated : 01 Apr 2022 14:25 IST

‘‘వైలెన్స్‌.. వైలెన్స్‌.. వైలెన్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌. బట్‌.. వైలెన్స్‌ లైక్స్‌ మీ’’ అంటూ ‘కె.జి.ఎఫ్‌-2’ ట్రైలర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు కథానాయకుడు యశ్‌. ఆయన హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రమే ‘కేజీఎఫ్‌2’. రెండేళ్ల క్రితం విడుదలైన ‘కేజీఎఫ్‌’కు కొనసాగింపుగా రూపొందింది. ఈ పాన్‌ ఇండియా చిత్రం ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ట్రైలర్‌ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కింది. ముఖ్యంగా ఇందులో యశ్‌ పలికిన శక్తిమంతమైన సంభాషణలకు సినీప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. కాగా, ఈ డైలాగ్‌ల వెనకున్న ఓ ఆసక్తికర విషయాన్ని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల బయటపెట్టారు. ఈ సినిమాలో యశ్‌ హీరోగా నటించడమే కాక.. తన పాత్రకు తానే సంభాషణలు రాసుకున్నట్లు ప్రశాంత్‌ వెల్లడించారు. ‘‘కేజీఎఫ్‌2’ ట్రైలర్‌ చూసిన చాలా మంది డైలాగ్స్‌ చాలా శక్తిమంతంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌లో చాలా వరకు యశ్‌నే స్వయంగా రాసుకున్నారు’’ అని ప్రశాంత్‌ నీల్‌ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడిగా నటించారు. రావు రమేష్‌, ప్రకాష్‌ రాజ్‌, రవీనా టాండన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts