‘అల’రించిన సంగీత కచేరి.. ఇంకా చూడలేదా?

గతేడాది సినీ పరిశ్రమకు మిగిలిన అత్యంత తక్కువ తీపి గుర్తుల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించగా.. ఇందులోని పాటలు సంగీత ప్రియులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాతో తెలుగు సినిమా పాటలు దేశాల సరిహద్దులు దాటి వినిపించాయి.

Updated : 06 Jan 2021 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది సినీ పరిశ్రమకు దక్కిన అత్యంత తక్కువ తీపి గుర్తుల్లో ‘అల వైకుంఠపురములో..’ ఒకటి. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించగా, అందులోని పాటలు సంగీత ప్రియులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాతో తెలుగు సినిమా పాటలు దేశ సరిహద్దులు దాటి వినిపించాయి. నేటికి సరిగ్గా ఏడాది క్రితం అంటే.. జనవరి 6, 2020న ‘ఏవీపీఎల్‌ మ్యూజికల్‌ కాన్సర్ట్ (సంగీత కచేరి)’ పేరుతో ఆ సినిమా పాటలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అలా విడుదలైన పాటలు ఎంతలా సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఆ సంగీత కచేరీకి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం మరోసారి ఆ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చిత్రబృందం 7.49 నిమిషాలకు కుదించి అభిమానులతో పంచుకుంది.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందీ సినిమా. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే హీరోహీరోయిన్లు. తమన్‌ సంగీతం అందించారు. ‘సామజవరగమన...’, ‘రాములో రాములా..’, ‘బుట్టబొమ్మ...’  పాటలైతే చిన్నాపెద్దా తేడా లేకుండా స్టెప్పులేయించాయి. సుశాంత్‌‌, నివేదా పేతురాజ్‌, టబు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్‌, తనికెళ్ల భరణి, జయరామ్‌, మురళీశర్మ, సముద్రఖని, నవదీప్‌, సునీల్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్లలోనే కాక అటు యూట్యూబ్‌లోనూ ఈ సినిమా పాటలు రికార్డులు సృష్టించాయి. ఈ సినిమాను ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ నిర్మించారు.

ఇదీ చదవండి..

ఈనాడు.నెట్‌ ప్రత్యేకం: వెన్నెల ‘కంటి వెలుగులు’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని