అందుకే యోగాపై అవగాహన ఉండాలనేది..!

యోగా అనేది ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన ప్రక్రియ. ఇష్టం వచ్చినట్లు ఆసనాలు వేస్తే కండరాలు పట్టేయడం ఖాయం. హీరో రవితేజకు అదే జరిగింది. కంగారు పడకండి. రవితేజ, శ్రుతిహాసన్‌ జంటగా నటించిన ‘క్రాక్‌’ సినిమాలో జరిగిందీ సంఘటన.

Published : 22 Jun 2021 00:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యోగా అనేది ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన ప్రక్రియ. ఇష్టం వచ్చినట్లు ఆసనాలు వేస్తే కండరాలు పట్టేయడం ఖాయం. హీరో రవితేజకు అదే జరిగింది. కంగారు పడకండి. రవితేజ, శ్రుతిహాసన్‌ జంటగా నటించిన ‘క్రాక్‌’ సినిమాలో జరిగిందీ సంఘటన. ఈ చిత్రాన్ని గోపీచంద్‌ మలినేని తెరకెక్కించారు. సినిమాలో.. హీరో తన స్నేహితులతో కలిసి యోగా తరగతులకు వెళతాడు. యోగాపై అవగాహన లేకుండానే ఏదోఒకటి వేద్దాం.. అనుకొని ఒక ఆసనం వేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంకేముంది.. కండరాలు పట్టేస్తాయి. హీరో నొప్పితో విలవిల్లాడుతున్నా పక్కనే ఉన్న వాళ్లంతా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే.. వాళ్లకు కూడా యోగాపై అవగాహన ఉండదు. ఇంతలోనే హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ వచ్చి రవితేజకు నొప్పి నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ క్రాక్‌ సినిమాలోని ఒక కామెడీ సన్నివేశాన్ని యూట్యూబ్‌లో పంచుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని