కారణం లేకుండా నన్ను నిందించారు: సునీత

కొంతమంది వ్యక్తుల నుంచి తాను ఎన్నో నెగటివ్‌ కామెంట్స్‌, ట్రోల్స్, వ్యతిరేకతను ఎదుర్కొన్నానని.. వాటన్నింటినీ పునాదిరాళ్లుగా మార్చుకుని జీవితంలో ధైర్యంగా ముందుకు సాగుతున్నానని ప్రముఖ గాయని....

Updated : 08 Mar 2021 15:08 IST

మహిళా దినోత్సవం.. గాయని స్పెషల్‌ పోస్ట్

హైదరాబాద్‌: కొంతమంది వ్యక్తుల నుంచి తాను ఎన్నో నెగటివ్‌ కామెంట్స్‌, ట్రోల్స్, వ్యతిరేకతను ఎదుర్కొన్నానని.. వాటన్నింటినీ పునాదిరాళ్లుగా మార్చుకుని జీవితంలో ధైర్యంగా ముందుకు సాగుతున్నానని ప్రముఖ గాయని సునీత పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా సందేశం పోస్టుచేశారు. ఆమె వ్యక్తిగత జీవితంలో చవిచూసిన ఎన్నో ఇబ్బందులను ప్రతిబింబించేలా ఈ పోస్ట్‌ ఉంది.

‘‘నా జీవితాన్ని మీరే నిర్ణయిస్తారు. ట్రోల్‌ చేస్తారు. నన్ను ప్రతిసారీ కిందకు లాగుతుంటారు. నాలో అభద్రతాభావాన్ని నెలకొల్పుతుంటారు. అలాగే, ఎప్పుడూ మీరు నన్ను నమ్మరు. నాకు అండగా నిలవరు. ఆఖరికి నేను చెప్పేది కూడా వినరు. నేను ఓడిపోయినప్పుడు నన్ను చూసి నవ్వుతుంటారు. ఇబ్బంది పెడుతుంటారు. ఎలాంటి కారణం లేకుండా నన్ను నిందించిన మీరే ఇప్పుడు నాకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారా!?

నేను మీ శుభాకాంక్షలు స్వీకరిస్తున్నాను! ఎందుకంటే మీరు నాపై విసిరిన రాళ్లేనే పునాదులుగా మార్చుకుని నా బలాన్ని మరింత పెంచుకుని.. జీవితంలో ముందుకు సాగుతున్నాను. చిరునవ్వుతో అన్నింటినీ క్షమించాను. ప్రేమను పంచాను. ఎందుకంటే నేను ఒక స్త్రీని.. అన్నింటినీ సహించాను!! మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!!!’’ అని సునీత పెట్టిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని