జేమ్స్‌ బాండ్‌ సినిమాలు చూస్తే డబ్బులిస్తారట!

మీరు అమెరికాలో ఉన్నారా? జేమ్స్‌ బాండ్‌ సినిమాలకు అభిమానులా?అయితే, ఈ వార్త మీకోసమే. జేమ్స్‌ బాండ్‌ సినిమాలను చూస్తే వెయ్యిడాలర్లు (రూ.72వేలు) ఇస్తామని ఓ వెబ్‌సైట్‌ ఆఫర్‌ ఇచ్చింది. నెర్డ్‌ బియర్‌(nerdbear.com) అనే వెబ్‌సైట్‌

Updated : 26 Mar 2021 15:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు అమెరికాలో ఉన్నారా? జేమ్స్‌ బాండ్‌ సినిమాలకు అభిమానులా?అయితే, ఈ వార్త మీ కోసమే. జేమ్స్‌ బాండ్‌ సినిమాలను చూస్తే వెయ్యి డాలర్లు (రూ.72వేలు) నగదు బహుమతి ఇస్తామని నెర్డ్‌ బియర్‌(nerdbear.com) అనే వెబ్‌సైట్‌ ప్రకటించింది. జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లో ‘నో టైమ్‌ టు డై’ చిత్రం గతేడాది ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. పలుమార్లు విడుదలకు సిద్ధం చేసినా మళ్లీ వెనకడుగు వేసింది చిత్రబృందం. చివరికి ఈ ఏడాది అక్టోబర్‌ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అప్పటి వరకు జేమ్స్‌ బాండ్‌ అభిమానులు నిరీక్షించక తప్పట్లేదు. అందుకే, అభిమానులు నిరుత్సాహ పడకుండా, వినోదం పంచడం, అలాగే కరోనా ఆందోళన నుంచి కాస్త తేరుకునేలా చేయడం కోసమే ఈ‘బింజ్‌-వాచ్‌ జేమ్స్‌ బాండ్‌ మూవీస్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించామని నిర్వాహకులు చెబుతున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

నెర్డ్‌బియర్‌ వెబ్‌సైట్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో మీరు జేమ్స్‌ బాండ్‌ సినిమాలకు ఎందుకు అభిమానిగా మారారు? ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీకున్న అర్హత ఏంటనే విషయాలను వెల్లడించాల్సి ఉంటుంది. నిర్వాహకులు మీ దరఖాస్తును పరిశీలించి విజేతలను ప్రకటిస్తారు. వారు నెల రోజుల వ్యవధిలో జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లో వచ్చిన 24 సినిమాలను చూసేయాలి. సినిమాలు చూడటం పూర్తి చేసిన వారికి ప్రకటించిన నగదు బహుమతితోపాటు అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డు, అక్టోబర్‌లో విడుదల కానున్న ‘నో టైమ్‌ టు డై’ సినిమా టికెట్లు ఇస్తారట. ఈ కార్యక్రమంలో పాల్గొనలాంటే ఏప్రిల్‌ 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

విజేతలు చూడాల్సిన సినిమాలు: 1. డాక్టర్‌. నో(1962), 2. ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌(1963), 3. గోల్డ్‌ ఫింగర్‌(1964), 4. థండర్‌ బాల్‌(1965), 5. యూ ఓన్లీ లీవ్‌ ట్వైస్‌(1967), 6. ఆన్‌ హర్‌ మెజిస్టీస్‌ సీక్రెట్‌ సర్వీస్‌(1969), 7. డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌(1971), 8. లీవ్‌ అండ్‌ లెట్‌ డై(1973), 9. ది మ్యాన్‌ విత్‌ ది గోల్డెన్‌ గన్‌(1974), 10. ది స్పై వూ లవ్‌డ్‌ మీ(1977), 11. మూన్‌రేకర్‌(1979), 12. ఫర్‌ యూవర్‌ ఐస్‌ ఓన్లీ(1981), 13. ఆక్టోపస్సీ(1983), 14. ఏ వ్యూ టు కిల్‌(1985), 15. ది లివింగ్‌ డేలైట్స్‌(1987), 16. లైసెన్స్‌ టు కిల్‌(1989), 17. గోల్డెన్‌ ఐ(1995), 18. టుమారో నెవర్‌ డైస్‌(1997), 19. ది వరల్డ్‌ ఇజ్‌ నాట్‌ ఇనఫ్‌(1999), 20. డై అనెదర్‌ డే(2002), 21. క్యాసినో రాయల్‌(2006), 22. క్వాంటమ్‌ ఆఫ్‌ సోలెస్‌(2008), 23. స్కైఫాల్‌(2012), 24.స్పెక్టర్‌(2015).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని