జోరు ప్ర‌ద‌ర్శిస్తోన్న ఆది

సినిమా అవకాశాల విష‌యంలో జోరు చూపిస్తున్నాడు యువ న‌టుడు ఆది సాయికుమార్‌. ఇప్ప‌టికే ఓ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌గా మ‌రో రెండు చిత్రాల్ని లైన్లో పెట్టాడు.

Published : 18 Jun 2021 13:34 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: సినిమా అవకాశాల విష‌యంలో జోరు చూపిస్తున్నాడు యువ న‌టుడు ఆది సాయికుమార్‌. ఇప్ప‌టికే ఓ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌గా మ‌రో రెండు చిత్రాల్ని లైన్లో పెట్టాడు. తాజాగా ఇంకో సినిమాని ప్ర‌క‌టించాడు. క‌ల్యాణ్‌జీ అనే ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. నాగం తిరుప‌తిరెడ్డి నిర్మాత‌. సాయి కార్తీక్ సంగీతం అందించ‌నున్నారు. నేప‌థ్యం, టైటిల్, నాయిక వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి. ఎస్‌. బ‌ల‌వీర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆది హీరోగా న‌టిస్తోన్న ‘అమ‌ర‌న్’ చిత్రం లాక్‌డౌన్‌కి ముందే సెట్స్‌పైకి వెళ్లింది. అవికా క‌థానాయిక‌. మ‌రోవైపు వీర‌భ‌ద్రం, భాస్క‌ర్ బంటుమిల్లి ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమాల్ని ఖ‌రారు చేశాడు ఆది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని