ఆ గొంతుకను ఎప్పుడూ వదులుకోవద్దు: భూమి

‘‘సమాజాన్ని ప్రభావితం చేయగల గొంతుకలు తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పాలి. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ వెనక్కి తగ్గొద్దు’’ అంటోంది బాలీవుడ్ నటి భూమి ఫెడ్నేకర్‌.

Published : 06 Jun 2021 01:11 IST

ముంబయి: ‘‘సమాజాన్ని ప్రభావితం చేయగల గొంతుకలు తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పాలి. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ వెనక్కి తగ్గొద్దు’’ అంటోంది బాలీవుడ్ నటి భూమి ఫెడ్నేకర్‌. తాజాగా ప్రపంచ పర్వావరణ దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘మన అభిప్రాయాన్ని సమాజం ముందు వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అప్పుడప్పుడు ఈ గొంతుకకు కొన్ని ఎదురుదెబ్బలు కూడా తగులుతాయి. మెరుగైన సమాజం కోసం మన గొంతుకను రెండింతలుగా పెంచాలి. కొన్ని ఇబ్బందులు సైతం ఎదురుకావచ్చు. కానీ మనం నమ్మిన ఆలోచనలు వ్యక్తపరచడానికి కొంత ఆత్మవిశ్వాసం కూడా అవసరం. అయితే ఇది బాధ్యత గల, జ్ఞానం కలిగిన చోట నుంచి రావాలి. సమాజాన్ని ప్రభావితం చేయగలిగే బాధ్యతగల వ్యక్తి  తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయరు. అసలు అలాంటి అవకాశాన్ని వదులుకోరు. వారికి ఇదే అతి పెద్ద సాధన అని, చాలా ముఖ్యమైనదని నా అభిప్రాయం. ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులను అనుసరించేవారు చాలామంది  ఉన్నప్పుడు మన గొంతుకని కచ్చితంగా చెప్పాలి. దానిని ఎప్పుడూ తగ్గించుకోకూడదు. మనం గట్టిగా చెప్పినప్పుడే దానికి గొప్ప శక్తి వస్తుంది. అప్పుడు మనల్ని అనుసరించే వారికి గొప్ప నమ్మకాన్ని కలిగిస్తుంది’’ అన్నారు. ప్రస్తుతం భూమి ‘మిస్టర్‌ లేలే’ చిత్రంలో నటిస్తోంది. ఇంకా రాజ్‌కుమార్‌ రావ్‌ ప్రధాన పాత్రలో వస్తున్న ‘బధాయి దో’లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. గత ఏడాది తెలుగు దర్శకుడు జి.అశోక్ తెరకెక్కించిన ‘దుర్గామతి’లో నటించి మెప్పించింది. ఇది అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రానికి రీమేక్‌. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని