TTF Vasan: ప్రముఖ యూట్యూబర్‌కు ప్రమాదం.. ఇలాంటి స్టంట్స్ చేయొద్దంటూ నెటిజన్ల విజ్ఞప్తి
ప్రముఖ యూట్యూబర్ ప్రమాదాని గురయ్యారు. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ యూట్యూబర్, బైకర్ వాసన్ (TTF Vasan) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ స్టంట్స్ చేయడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలో పడిపోయారు. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. వాసన్ చేతికి గాయమవగా ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ప్రమాదం జరగ్గా సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘మీరు ఇలాంటి స్టంట్స్ చేయకండి. ప్రాణాల మీదకు తెచ్చుకోకండి’ అంటూ పలువురు నెటిజన్లు తమ ఫాలోవర్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. వాసన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వాసన్‌పై తమిళనాడు పోలీసులు ఇటీవల ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేశారు. అయినా తన పద్ధతి మార్చుకోలేదంటూ కొందరు తప్పుబడుతున్నారు.
‘జవాన్’.. ప్రాంక్ కాల్ అనుకున్నా.. అక్కడికి వెళ్లిన రోజు ఏడ్చేశా: సిరి హన్మంత్
కోయంబత్తూరుకు చెందిన వాసన్ ట్విన్ థ్రోట్లర్స్ (Twin Throttlers) పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. కొత్త బైక్స్ విశేషాలు, వాటి టెస్ట్ రైడ్, బైక్‌పై విహార యాత్రలు.. ఇలా ఎక్కువగా ద్విచక్ర వాహనాలకు సంబంధించి వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఈ ఛానెల్‌కు 4.06 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇలా నెట్టింట విశేష క్రేజ్ సంపాదించుకున్న వాసన్ ‘టీటీఎఫ్ వాసన్’గా మారారు. మరోవైపు వాసన్ ‘మంజల్ వీరన్’ (తమిళం) సినిమాతో హీరోగా ఆయన తెరంగేట్రం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Netherlands: నెదర్లాండ్స్‌లో కాల్పుల కలకలం.. తొలుత ఓ ఇంటిపై.. ఆతర్వాత ఆసుపత్రిలో
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Amaravati: కాగ్ నివేదికలు వైకాపా అసమర్థ పాలనకు నిదర్శనం: ఎమ్మెల్సీ అశోక్‌బాబు
-
Kharge: మహిళా రిజర్వేషన్ల బిల్లు.. అది భాజపా గారడీనే: ఖర్గే
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!