‘పఠాన్‌’ వసూళ్లు రూ.729కోట్లు

షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), దీపికాపదుకొణె (Deepika Padukone) జంటగా తెరెకెక్కిన చిత్రం పఠాన్‌ (Pathaan) ఇప్పటివరకూ రూ.729కోట్ల గ్రాస్‌ రాబట్టింది. పదిరోజుల్లోనే పఠాన్‌ సినిమా అత్యధిక వసూళ్లని సాధించిన హిందీ చిత్రంగా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిల్మ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Updated : 05 Feb 2023 06:48 IST

షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), దీపికాపదుకొణె (Deepika Padukone) జంటగా తెరెకెక్కిన చిత్రం పఠాన్‌ (Pathaan) ఇప్పటివరకూ రూ.729కోట్ల గ్రాస్‌ రాబట్టింది. పదిరోజుల్లోనే పఠాన్‌ సినిమా అత్యధిక వసూళ్లని సాధించిన హిందీ చిత్రంగా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిల్మ్‌ (YRF) ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘పఠాన్‌’ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌.. టైగర్‌గా ప్రత్యేక పాత్రలో కనిపించారు. డింపుల్‌కపాడియా, ఆశుతోష్‌ కీలక పాత్రలు పోషించారు. పఠాన్‌ చిత్ర విజయంపై మీ స్పందన ఏమిటని షారుక్‌ని ట్విటర్‌ ద్వారా అభిమానులు అడగగా.. ‘స్టైలిష్‌ యాక్షన్‌లో గూడఛారి పాత్రలో నటించిన 57ఏళ్ల నటుడిపై చూపిస్తున్న ప్రేమకు ఇప్పటికీ అనుభూతి చెందుతున్నాను. ప్రేక్షకుల స్పందన నా అంచనాలకు మించిపోయింది’ అని అన్నారు. ‘ప్రయాణం అనేది ముఖ్యం....ముగింపు కాదు’ అని తన పిల్లలకు చెబుతుంటానని కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు షారుక్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని