అదిరే స్టెప్పులతో ‘యువరత్న’ సాంగ్‌!

కన్నడలో అగ్రనటుడిగా వెలుగొందుతున్న పునీత్‌ రాజ్‌కుమార్‌(ఫ్యాన్స్‌ ‘అప్పు’గా పిలుచుకుంటారు) తెలుగులో తొలిసారి స్ట్రెయిట్‌ చిత్రంతో వస్తున్నారు. ‘యువరత్న’పేరుతో వస్తున్న ఈ చిత్రంలోని తెలుగు వెర్షన్‌ పాటలు కొన్ని ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి.

Published : 17 Mar 2021 22:21 IST

హైదరాబాద్‌: కన్నడలో అగ్రనటుడిగా వెలుగొందుతున్న పునీత్‌ రాజ్‌కుమార్‌(ఫ్యాన్స్‌ ‘అప్పు’గా పిలుచుకుంటారు) తెలుగులో తొలిసారి స్ట్రెయిట్‌ చిత్రంతో వస్తున్నారు. ‘యువరత్న’పేరుతో వస్తున్న ఈ చిత్రంలోని తెలుగు వెర్షన్‌ పాటలు కొన్ని ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ‘యువరత్న’టైటిల్‌ సాంగ్‌ను అప్పు పుట్టినరోజు కానుకగా చిత్రబృందం రిలీజ్‌ చేసింది. ముఖ్యంగా పునీత్‌ రాజ్‌కుమార్‌ తనదైన శైలిలో వేస్తున్న స్పీడ్‌ డ్యాన్స్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. సాయేషా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘కె.జి.ఎఫ్’ఫేమ్‌ హోమబలే సంస్థ నిర్మిస్తోంది. సంతోష్ అన్నాద్రం దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఫీల్‌ ద పవర్‌’ పవర్‌ అంటూ సాగుతున్న ఈ పాటను రేవంత్‌ ఆలపించగా, కల్యాణ చక్రవర్తి సాహిత్యం అందించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఏప్రిల్‌ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటిదాకా అప్పు అదిరే స్టెప్పులను ఓ లుక్కేసుకోండి!   


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు