Bollywood: ముద్దు సీన్ రిహార్సల్ అన్నాడు
సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘వీర్’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘హేట్ స్టోరీ -3’, ‘హౌస్‌ఫుల్-2’ సినిమాలతో బీటౌన్‌లో విజయాలను అందుకున్నారు నటి జరీన్ ఖాన్. అనుకోని విధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి పెదవి విప్పారు.
క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించిన నటి
ముంబయి: సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘వీర్’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘హేట్ స్టోరీ -3’, ‘హౌస్‌ఫుల్-2’ సినిమాలతో బీటౌన్‌లో విజయాలను అందుకున్నారు నటి జరీన్ ఖాన్. అనుకోని విధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి పెదవి విప్పారు. కెరీర్ ఆరంభంలో తాను కూడా దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్పష్టం చేశారు. అప్పట్లో ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె అన్నారు.
‘‘కెరీర్ ఆరంభంలో నేను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నన్ను ఇబ్బంది పెట్టినవాళ్ల పేర్లను ఇప్పుడు బయట పెట్టాలనుకోవడం లేదు. కానీ ఒకానొక సమయంలో ఓ వ్యక్తి మాత్రం ముద్దు సన్నివేశాలను సైతం రిహార్సల్స్ చేద్దామన్నాడు. ఆ మాటలకు నేను షాకయ్యాను. అలాంటి వాటిని నేను చేయనని చెప్పాను. దానికి అతను ‘మనం ఫ్రెండ్స్ కంటే ఎక్కువ. ఇకపై నీ సినిమా వ్యవహారాలన్నింటినీ నేనే చూసుకుంటా. కావాలంటే అన్ని సినిమాల్లో నువ్వే మెయిన్ హీరోయిన్గా ఉండేలా చూస్తా’ అని చెప్పాడు. అతను అనుకున్న విధంగా పని చేయడం నాకిష్టం లేదని చెప్పేశానని జరీన్ ఖాన్ తెలిపారు. మరోవైపు, 2019లో విడుదలైన ‘చాణక్య’తో జరీన్ తెలుగులోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. గోపీచంద్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా అనుకున్నంతగా ఫలితాలను అందుకోలేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్‌కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి