Web Series: 11 సరికొత్త వెబ్‌ సిరీస్‌లు.. ఒకే వేదికపై.. ఎక్కడంటే?

కొత్త సినిమాల ప్రసార హక్కులు సొంతం చేసుకోవడంతోపాటు విభిన్న వెబ్‌ సిరీస్‌లను ప్రేక్షకులకు అందించేందుకు  ఓటీటీ సంస్థలు పడుతున్నాయి.  

Published : 16 Jun 2022 02:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త సినిమాల ప్రసార హక్కులు సొంతం చేసుకోవడంతోపాటు విభిన్న వెబ్‌ సిరీస్‌లను ప్రేక్షకులకు అందించేందుకు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. అవి రూపొందించే ప్రాజెక్టులను ప్రకటించి ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ‘జీ 5’ (Zee 5) ఇప్పుడిదే దారిలో పయనిస్తోంది. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా 11 వెబ్‌ సిరీస్‌లను త్వరలోనే అందించనున్నట్టు సంస్థ వెల్లడించింది. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌కు హరీష్‌ శంకర్‌, ప్రవీణ్‌ సత్తారు, శరత్‌ మరార్‌, కోన వెంకట్‌, నిహారిక, సుస్మిత కొణిదెల, సుశాంత్‌, ఆది సాయికుమార్‌, రాజ్‌ తరుణ్‌ తదితరులు హాజరయ్యారు.

‘జీ 5’ ఖరారు చేసిన సిరీస్‌ టైటిళ్లు ఇవీ.. ‘రెక్కీ’ (Recce) ‘అహ నా పెళ్లంట’ (Aha Na Pellanta), ‘ఏటీఎం’ (ATM), ‘మా నీళ్ల ట్యాంక్‌’ (Maa Neella Tank), ‘బహిష్కరణ’, ‘పరువు’, ‘ది బ్లాక్‌ కోట్‌’, ‘ప్రేమ విమానం’, ‘హంటింగ్‌ ఆఫ్‌ ది స్టార్స్‌’, ‘హలో వరల్డ్‌’, ‘మిషన్‌ తషాఫీ’.

తాడిపత్రి నేపథ్యంలో రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘రెక్కీ’. శ్రీరామ్‌, శివ బాలాజీ, ధన్య బాలకృష్ణ తదితరులు ప్రధాన పాత్రధారులు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. హీరో సుశాంత్‌ ప్రధాన పాత్రలో ‘మా నీళ్ల ట్యాంక్‌’ తెరకెక్కుతోంది. ఈ సిరీస్‌ రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో సాగుతుంది. వీజే సన్నీ, సుబ్బరాజు, పృథ్వీ ప్రధాన పాత్రల్లో ‘ఏటీఎం’ రూపొందుతోంది. దీనికి ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ కథ అందిస్తూ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజ్‌తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా వినోదాత్మకంగా రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ ‘అహ నా పెళ్లంట’. ఐటీ ఉద్యోగుల ఇతివృత్తంగా వస్తున్న ‘హలో వరల్డ్‌’ వెబ్‌ సిరీస్‌ను నిహారిక నిర్మిస్తున్నారు. గూఢచారి కథాంశంతో ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న సిరీస్‌ ‘మిషన్‌ తుషాఫీ’. స్ట్రీమింగ్‌ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని