Published : 23 May 2022 09:06 IST

SS రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం ‘RRR’ జీ5 వేదికగా గ్లోబల్‌ ఆడియన్స్‌ ముందుకు (ప్రకటన)

మే 20 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో RRR వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌

దక్షిణాసియా సినిమాలకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌ ZEE5 Global. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాల్‌ సహా ఇతర భాషల్లోని సినీ ప్రేక్షకులను అలరించేందుకు నిరంతరం వివిధ ఫార్మట్లలో అనేక రకాల కంటెంట్‌ను ఇది తీసుకువస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి పరిచయం చేసి.. అన్ని బాక్సాఫీసుల వద్ద విజయ ఢంకా మోగించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తాజాగా ‘జీ5 గ్లోబల్‌’ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

చాలా మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఈ సినిమా ఇప్పుడు వారి ఇళ్ల వద్దకే వచ్చింది. 1920లో బ్రిటిష్‌ సామ్రాజ్యంపై పోరాడిన ఇద్దరు భారతీయ విప్లవకారుల పాత్రల్లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ జీవించగా.. అలియా భట్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియా శరణ్‌,సముద్రఖని, రే స్టీవెన్‌సన్‌, అలిసన్‌ డూడీ, ఒలివియా మోరీస్‌ ఇతర ముఖ్యపాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మార్చి 25న విడుదలై రికార్డుల సునామీ సృష్టించింది. తాజాగా ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమాను సినీ అభిమానులు అత్యుత్తమ 4K నాణ్యత, డాల్బీ అట్మాస్‌ సాంకేతికతతో నేరుగా వారి ఇంటి నుంచే వీక్షించవచ్చు. ఎన్టీఆర్‌ జన్మదినం కానుకగా జీ5 వేదికగా ఈ సినిమా మే 20 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

జీ5 గ్లోబల్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అర్చనా ఆనంద్‌ మాట్లాడుతూ..‘‘దక్షిణాసియా నుంచి అత్యుత్తమ కథలను జీ5 ద్వారా ప్రపంచం ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. నేడు దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అద్భుత దృశ్యకావ్యం ఆర్‌ఆర్‌ఆర్‌ను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. సినిమా సజీవ భావోద్వేగాలతో అసలైన అనుభూతిని ఇచ్చేందుకు ఎక్స్‌క్లూజివ్‌గా జీ5 వేదికగా మాతృక తెలుగులో అందుబాటులోకి తీసుకువచ్చాం. తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో ఇంగ్లిష్‌ సబ్‌టైటిళ్లతో ఇది అందుబాటులో ఉంది. సినీ ప్రియులందరూ తప్పక చూడాల్సిన చిత్రమిది’’ అని తెలిపారు.

ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు ఇటీవల విడుదలైన బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’(ఈ సినిమా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఎంపిక చేసిన గ్లోబల్‌ మార్కెట్లలోనూ అందుబాటులో ఉంది. యూకేలో మే 25 నుంచి స్ట్రీమిగ్‌ కానుంది), అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ఝుంద్‌, అటాక్‌(పార్ట్‌ 1), బంగార్రాజు(తెలుగు) ఇలా ఎన్నో చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటిపై 40 శాతం లిమిటెడ్‌ పీరియడ్‌తో పాటు వార్షిక ప్యాకేజీపై డిస్కౌంట్‌ ఆఫర్లు కూడా ఉన్నాయి.

మే 20న 00:00 hours (IST) నుంచి జీ5 గ్లోబల్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్యాక్స్‌లో RRR అందుబాటులో ఉంది.

జీ5 గ్లోబల్‌ గురించి..

డిజిటల్‌ వేదికగా ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే లక్ష్యంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ ‘జీ5 గ్లోబల్’ను తీసుకొచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్‌ను 2018 అక్టోబరులో ప్రారంభించారు. 190కి పైగా దేశాల్లో 18 భాషల్లో జీ5 గ్లోబల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మలయాళం, తమిళ్‌, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీతో పాటు ఆరు విదేశీ భాషల్లో(మలై, థాయ్‌, బహాసా, ఉర్దూ, బంగ్లా, అరబిక్) ఈ ప్లాట్‌ఫామ్‌ సేవలందిస్తోంది. ఈ వేదికపై 1,70,000 గంటలకు పైగా ఆన్‌ డిమాండ్‌ కంటెంట్ ఉంది. సినిమాలతో పాటు టీవీ షోలు, మ్యూజిక్‌, ఆరోగ్యం, లైఫ్‌ స్టైల్‌ కంటెంట్ ఇలా ఎన్నో ఉన్నాయి. 15 స్థానిక భాషలతో పాటు, కంటెంట్‌ డౌన్‌లోడ్‌ ఆప్షన్‌, వీడియో ప్లేబ్యాక్‌, వాయిస్‌ సెర్చ్‌ వంటి ఫీచర్లు జీ5 గ్లోబల్‌లో ఉన్నాయి.

ZEE5 Global Twitter: https://twitter.com/ZEE5Global

ZEE5 Global LinkedIn: https://www.linkedin.com/company/zee5global/

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని