Oxygen: అక్షయ్‌ జంట మరో సాయం

కరోనా మరోసారి విలయతాండవం చేస్తోంది. సెకండ్‌వేవ్‌తో దేశం కొట్టుమిట్టాడుతోంది. కరోనా బారినపడ్డ ఎంతోమంది అభాగ్యులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా.. బాలీవుడ్‌ జంట అక్షయ్‌కుమార్‌, ట్వింకిల్‌ఖన్నా తమ దాతృత్వం చాటుకున్నారు.

Updated : 30 Aug 2022 11:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మరోసారి విలయతాండవం చేస్తోంది. సెకండ్‌వేవ్‌తో దేశం తీవ్ర విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది. కరోనా బారినపడ్డ ఎంతోమంది అభాగ్యులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా.. బాలీవుడ్‌ జంట అక్షయ్‌కుమార్‌, ట్వింకిల్‌ ఖన్నా తమ దాతృత్వం చాటుకున్నారు. ఇటీవల అక్షయ్‌కుమార్‌ భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఫౌండేషన్‌కు రూ.కోటి విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోసారి 100 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను అందిస్తున్నట్లు  ప్రకటించారు. కరోనాతో పోరులో భాగంగా తమవంతుగా ఈ సాయం చేస్తున్నట్లు అక్షయ్‌ సతీమణి ట్వింకిల్‌ఖన్నా పేర్కొన్నారు.

‘నా సొంత కుటుంబ సభ్యుల అనారోగ్యం వల్ల గత కొన్ని వారాలుగా కరోనా బాధను నేను కూడా అనుభవించాను. కానీ.. నేను అందులో ఎక్కువ రోజులు ఉండలేకపోయా. దైవిక్ ఫౌండేషన్ ద్వారా లండన్ ఎలైట్ హెల్త్‌కు చెందిన డాక్టర్ ద్రష్నికా పటేల్‌, డాక్టర్ గోవింద్ బంకాని 120 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ దానం చేశారు. అక్షయ్‌కుమార్‌, నేనూ మరో 100 ఇస్తున్నాం. మొత్తంగా 220 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ ఇవ్వగలిగాం. అందుకే మీ అందర్నీ వేడుకుంటున్నా.. మీకు తోచినంత సాయం చేయండి’ అని ఆమె పేర్కొంది. ఇటీవల కరోనాకు గురైన అక్షయ్‌ ముంబయిలో చికిత్స పొంది ఈ మధ్యే కోలుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని