కోలుకుంటున్నా.. మీ ప్రేమకు థాంక్స్‌: నిఖిల్‌ 

తాను వేగంగా కోలుకుంటున్నానని యువ కథానాయకుడు నిఖిల్‌ అన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ ‘కార్తికేయ2’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో చిత్రీకరణ జరుగుతోంది........

Published : 12 Mar 2021 01:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను వేగంగా కోలుకుంటున్నానని యువ కథానాయకుడు నిఖిల్‌ అన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ ‘కార్తికేయ2’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో చిత్రీకరణ జరుగుతోంది. కాగా, చిత్రీకరణ సందర్భంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించే క్రమంలో నిఖిల్‌ కాలికి గాయమైంది. దీంతో నిఖిల్‌ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంపై నిఖిల్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. తన కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు. తనకు చాలామంది ఫోన్లు చేసి యోగక్షేమాలు తెలసుకుంటున్నారని, మరికొంత మంది మెసెజ్‌లు పంపుతున్నారని అన్నాడు. రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తా.. అంటూ ఆయన ఫొటో పంచుకున్నాడు.

గతంలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు మంచి ఆదరణ వచ్చింది. దానికి సీక్వెల్‌గా ‘కార్తికేయ2’ను తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగర్వాల్‌ నిర్మాతలు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని