Jabardasth బర్నింగ్‌స్టార్‌ ఫైర్‌.. జబర్దస్త్‌లో సందడి చేసిన సంపూర్ణేష్‌బాబు

వారంవారం సరికొత్తగా వినోదం పంచుతూ ప్రేక్షకులను అలరించే ‘జబర్దస్త్‌’ వచ్చే వారం రెట్టిపు కామెడీతో సిద్ధమవుతోంది. ప్రతి గురువారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఈసారి ‘క్యాలీఫ్లవర్‌’ హీరో సంపూర్ణేశ్‌బాబు పాల్గొని సందడి చేశారు. సినిమాలోని ఓ

Updated : 17 Aug 2022 10:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వారంవారం సరికొత్తగా వినోదం పంచుతూ ప్రేక్షకులను అలరించే ‘జబర్దస్త్‌’ వచ్చే వారం రెట్టింపు కామెడీతో సిద్ధమవుతోంది. ప్రతి గురువారం ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఈసారి ‘క్యాలీఫ్లవర్‌’ హీరో సంపూర్ణేశ్‌బాబు పాల్గొని సందడి చేశారు. సినిమాలోని ఓ భారీ డైలాగ్‌ చెప్పి వారెవ్వా అనిపించారు. దీనికి సంబంధించి ప్రోమో విడుదలైంది. ఆది వేసిన పంచులు ఎప్పటిలాగే అందర్నీ కడుపుబ్బా నవ్వించాయి. ఆ తర్వాత రాఘవ, అభి, తాగుబోతు రమేశ్‌ తమదైన స్టైల్‌లో కామెడీ చేసి సందడి చేశారు. చంటి ఈసారి ‘ఐ’ సినిమాలో గెటప్‌ వేసి విక్రమ్‌గా మారాడు. కాగా ఈ పూర్తి ఎపిసోడ్‌ ఆగస్టు 5న ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటివరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని