థియేటర్లలోనే ‘పాగల్‌’ సందడి.. విడుదల ఎప్పుడంటే..

నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా.. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదరణ సొంతం చేసుకున్న నటుడు విశ్వక్‌సేన్‌. ఈసారి లవర్‌బాయ్‌గా మారి ‘పాగల్‌’ అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే వరుస అప్డేట్లు ఇస్తూ అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్న చిత్రబృందం మొత్తానికి విడుదల తేదీ ఖరారు చేసింది.

Published : 07 Aug 2021 22:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా.. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదరణ సొంతం చేసుకున్న నటుడు విశ్వక్‌సేన్‌. ఈసారి లవర్‌బాయ్‌గా మారి ‘పాగల్‌’ అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే వరుస అప్‌డేట్లు ఇస్తూ అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్న చిత్రబృందం మొత్తానికి విడుదల తేదీ ఖరారు చేసింది. ఆగస్టు 14న థియేటరల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు విశ్వక్‌సేన్‌ మరో కొత్తలుక్‌ను కూడా చిత్రబృందం పంచుకుంది. అందులో ఎర్ర గులాబీ చేతిలో పట్టుకొని విశ్వక్‌ ఉండగా.. ఆకాశంలో మబ్బులు లవ్‌ సింబల్‌లో కనిపిస్తున్నాయి. కాగా.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, పాటలు అన్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు నరేశ్‌కుప్పిలి దర్శకత్వం వహించారు. విశ్వక్‌ సరసన నివేద పేతురాజ్‌ సందడి చేయనుంది. సిమ్రన్‌ చౌదరి, రాహుల్‌ రామకృష్ణ, మురళీశర్మ, మేఘాలేఖ, ఇంద్రజ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. రధన్‌ సంగీతం అందించారు. దిల్‌రాజు సమర్పణలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌, లక్కీ మీడియా బ్యానర్స్‌ పతాకాలపై బెక్కం వేణుగోపాల్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు