Updated : 27 Jun 2022 08:09 IST

TANA: 2023 జులై 7 నుంచి 9 వరకు 23వ తానా మహాసభలు

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) 23వ మహాసభలను 2023 జులై 7 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్నట్లు వివరించారు. తానా సైట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌ అనిల్‌ యలమంచిలి, సభ్యులు పూర్ణ వీరపనేని, రామ్ మద్ది బృందం తానా మహాసభల వేదిక కోసం అట్లాంటాతో పాటు పలు నగరాలలోని కన్వెన్షన్ సెంటర్‌లతో చర్చించినట్లు అంజయ్య చౌదరి తెలిపారు. అనంతరం పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో మహాసభలు నిర్వహించాలని తానా సైట్ సెలక్షన్ కమిటీ చేసిన సిఫార్సుకు తానా కార్యవర్గం, బోర్డు ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు.

తానా మహాసభల కో-ఆర్డినేటర్‌గా రవి పొట్లూరిని నియమించినట్లు తెలిపారు. తానాలో రీజినల్ కో-ఆర్డినేటర్ నుంచి కార్యదర్శి వరకు పలు పదవులు నిర్వహించి, తానా కార్యక్రమాల నిర్వహణలో విశేష అనుభవమున్న రవి పొట్లూరి కో- ఆర్డినేటర్‌గా, తానా సభ్యులు, దాతలు సహకారంతో 23వ మహాసభలు అంగరంగ వైభవంగా జరపనున్నట్లు అంజయ్య చౌదరి వెల్లడించారు. తనను తానా కో-ఆర్డినేటర్‌గా నియమించినందుకు అంజయ్య చౌదరి, తానా కార్యవర్గానికి రవి పొట్లూరి కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని