
అమెరికాలోని మాల్లో కాల్పులు..
8 మందికి గాయాలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. విస్కాన్సిన్ ప్రాంతంలోని ఓ మాల్లోకి ప్రవేశించిన అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. తప్పించుకున్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శుక్రవారం విస్కాన్సిన్లోని సబర్బన్ విల్వాకీ మాల్లోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు.. వినియోగదారులు, మాల్ సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకునేసరికి ఆగంతకుడు తప్పించుకున్నాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎఫ్బీఐ అధికారులు ట్విటర్ ద్వారా వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు వావాటోసా మేయర్ డెన్నిస్ మెక్బ్రిడ్జ్ మీడియాతో పేర్కొన్నారు. గాయపడ్డవారెవరికీ ప్రణాపాయం లేదని స్పష్టం చేశారు. నిందితుడు 20-30 ఏళ్ల మధ్య ఉన్న శ్వేతజాతీయుడని మాల్లో ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులు పోలీసులకు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.