
ఆస్టిన్లో వైభవంగా బతుకమ్మ వేడుకలు
ఆస్టిన్: తెలంగాణతో పాటు బతుకమ్మ సంబురాలు విదేశాల్లోనూ ఘనంగా జరిగాయి. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో తెలుగు మహిళలంతా ఒక దగ్గర చేరి బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణతో ముస్తాబైన మహిళలంతా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పాటలు పాడుతూ లయబద్ధంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.