Updated : 29 Sep 2020 17:08 IST

అమెరికా వినుకో ఇక!

కీలకాంశాలపై ట్రంప్‌-బైడెన్‌ల మనోగతం
తొలి ముఖాముఖిలో తలపడనున్న అధ్యక్ష అభ్యర్థులు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన మరో ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కాబోతోంది. అదే అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి సంవాదం. మంగళవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.30 నిమిషాలకు) రిపబ్లిక్‌ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ వివిధ అంశాలపై ఒకే వేదిక నుంచి తమ వాదనను ప్రజలకు వివరంగా వినిపిస్తారు. అమెరికా ఫస్ట్‌ అంటున్న ట్రంప్‌తో.. అమెరికా అందరిదీ అంటున్న బైడెన్‌ల మధ్య క్లీవ్‌లాండ్‌లో జరిగే ఈ తొలి సంవాదం నేపథ్యంలో.. ఎన్నికను ప్రభావితం చేసే కీలకాంశాలపై వీరి వైఖరులేంటో క్లుప్తంగా చూద్దాం...!

రిపబ్లిక్‌ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

ఉద్యోగాలు-ఆర్థిక విధానం

*2017లో వ్యక్తిగత, వాణిజ్య పన్నుల్ని గణనీయంగా తగ్గించటం సానుకూలాంశం

*దీంతో స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెరిగాయి

*బలమైన లేబర్‌ మార్కెట్‌తో ఉద్యోగాల కల్పన

*అమెరికాలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత తక్కువ నిరుద్యోగిత ట్రంప్‌ హయాంలో నమోదు (కరోనా కాలాన్ని తప్పిస్తే)

విదేశాంగ విధానం

*అమెరికా ఫస్ట్‌ అనే నినాదమే ట్రంప్‌ విదేశాంగ విధానాన్ని నడిపించింది.

*ఉత్తరకొరియా, రష్యాలతో చర్చలు జరుపుతూ అమెరికాకు ఆది  నుంచీ మిత్రులుగా ఉన్న నాటో దేశాలతో సంబంధాలు చెడగొట్టుకున్నారనేది విమర్శకుల మాట.

*ఉప్పునిప్పుగా ఉన్న ఇజ్రాయెల్‌-యూఏఈ మధ్య సంబంధాలకు ఒప్పందంపై సంతకం చేయించటం ట్రంప్‌ సాధించిన విజయం.
 

ఇమిగ్రేషన్‌

*ఇప్పటిదాకా కుటుంబ బంధాల ఆధారంగా సాగుతున్న వీసా పద్ధతికి స్వస్తి. కేవలం నిపుణులకే పెద్దపీట.

*వీసాల జారీ విధానం కఠినతరం. ముఖ్యంగా పలు ముస్లిం దేశాలనుంచి రాకపై నిషేధం.

*కేవలం ఉన్నతస్థాయి నిపుణులకే వీసాలు, గ్రీన్‌కార్డులు జారీ చేసేలా ప్రతిపాదనలు

*అందులోనూ మళ్ళీ వారి భాగస్వాములు, పిల్లలకు స్పాన్సర్‌షిప్‌ నిరాకరణ. 

వాతావరణ మార్పు

*వాతావరణ మార్పులను అంగీకరించినా... అది ప్రాధాన్యాంశం కాదని వాదన

*అందుకే పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు ప్రకటన

*అలాస్కాలోని ఆర్కిటిక్‌ నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ రెఫ్యూజీలో చమురు, గ్యాస్‌ నిల్వల అన్వేషణకు పచ్చజెండా

పోలీసు సంస్కరణలు

*పోలీసు వ్యవస్థకు బలమైన మద్దతు

*నల్లజాతి నిరసనల సమయంలోనూ పోలీసులకు దన్ను

*అయితే పోలీసులు అతిదౌర్జన్యం చేయకుండా అడ్డుకునే సంస్కరణలకు సై

తుపాకీ సంస్కృతి

*2017లో లాస్‌వెగాస్‌లో కాల్పుల తర్వాత సెమీ ఆటోమెటిక్‌   తుపాకులపై నిషేధం విధించారు. అంతేగాకుండా సమాజానికి  ఇబ్బంది కల్గిస్తారనే వారికి తుపాకీని దూరం చేసే సంస్కరణలు తీసుకొచ్చారు. ఇది కొంతమేరకు ఫలితాన్నిచ్చిందంటారు.

*కానీ తర్వాత అంతగా మాటలకే పరిమితమై... తుపాకీ లైసెన్స్‌ అమెరికన్ల హక్కు అనే సంస్కృతికే తలొగ్గారు.

డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌

ఉద్యోగాలు-ఆర్థిక విధానం

*మధ్యతరగతికి అండగా నిలవటం, వారికి ప్రోత్సాహకాలు

*సంపన్నులనే కాకుండా పనిచేసేవారిని ప్రోత్సహించే విధానం కావాలని పిలుపు

*గంటకు కనీస వేతనం 15డాలర్లుండేలా చర్యలు

*వ్యక్తిగత పన్నులను 39.5శాతానికి, కార్పొరేట్‌ పన్నుల్ని 21 నుంచి 28 శాతానికి పెంచుతానని ప్రకటన

విదేశాంగ విధానం

*ట్రంప్‌ హయాంలో దెబ్బతిన్న అమెరికా పాత మిత్ర దేశాలతో సంబంధాల పునరుద్ధరణ. ముఖ్యంగా నాటో కూటమితో!

*చైనాతో ఘర్షణాత్మక వైఖరే! అయితే... ఏకపక్షంగా వాణిజ్య ఆంక్షలు కాకుండా ఇతర దేశాలతో కలసి కూటమిగా ఆంక్షలు విధించి చైనాను దారికి తేవాలని యోచన.

ఇమిగ్రేషన్‌

*సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించిన వారిలో కొంతమందికి మానవతా దృక్పథంతో పౌరసత్వం ఇవ్వాలి. ముఖ్యంగా (తల్లిదండ్రులతో వచ్చిన) చిన్నపిల్లలకు, ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేనివారికి.

*ఇతర దేశాల వారిని ఆహ్వానించటం వల్లే అమెరికా అభివృద్ధి సాధిస్తుంది.

*చట్టవిరుద్ధంగా ఎవ్వరూ ప్రవేశించకుండా జాగ్రత్తలు.

*విదేశీయులకు వీసాల జారీలో సంస్కరణలు

*అమెరికాలో పీహెచ్‌డీ పూర్తిచేసే విద్యార్థులకు వెంటనే గ్రీన్‌కార్డు ప్రదానం.

వాతావరణ మార్పు

*2050కల్లా ప్రమాదకర వాయు ఉద్గారాల్ని నిర్మూలించటానికి 1.7 ట్రిలియన్‌ డాలర్లు ఖర్చు చేసేలా ప్రణాళిక

*పారిస్‌ పర్యావరణ ఒప్పందానికి అంగీకారం. తిరిగి అమెరికా చేరేందుకు సమ్మతి.

పోలీసు సంస్కరణలు

*పోలీసు వ్యవస్థకు నిధుల కోతకు వ్యతిరేకం

*అయితే వారిపై పనిభారం తగ్గించేందుకు సంసిద్ధత

*సంస్కరణల్లో భాగంగా బాడీ కెమెరాలు, కమ్యూనిటీ పోలీసింగ్‌కు పెద్దపీట

తుపాకీ సంస్కృతి

*విశృంఖలంగా కాల్చివేసే తరహా తుపాకులపై నిషేధం యోచన

*సమాజంలో తుపాకీ సంస్కృతిని తగ్గించటానికిగాను, ఆయా రాష్ట్రాలు తుపాకుల్ని ప్రజల నుంచి కొనేలా ప్రయత్నిస్తానని హామీ

*ఎవరు పడితే వాళ్ళు కాకుండా కొన్నవారు మాత్రమే ఉపయోగించేలా, బయోమెట్రిక్‌తో పనిచేసే స్మార్ట్‌గన్స్‌ తయారు చేయాలని పిలుపు

- ఈనాడు ప్రత్యేక విభాగం 

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని