
రష్యా కాదు, చైనాయే..: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ శాఖలు, సంస్థలపై ఇటీవల చోటుచేసుకున్న సైబర్ దాడులను గురించి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు. ఈ ఘటన వెనుక చైనా హస్తం ఉండవచ్చని ఆయన అన్నారు. ఈ దాడి వల్ల ప్రభుత్వ శాఖలే కాకుండా ప్రైవేటు నెట్‌వర్క్‌లకు కూడా ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ సెక్యూరిటీ ఏజన్సీ ఓ అసాధారణ హెచ్చరిక జారీచేసింది. పకడ్బందీగా జరిగిన ఈ దాడి నుంచి బయటపడటం అంత సులభం కాదని సంబంధిత అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, పదవీకాలం కొద్ది రోజుల్లో ముగుయనున్న నేపథ్యంలో ట్రంప్ వ్యవహార శైలి కొన్ని అంశాల్లో చర్చనీయాంశంగా మారింది. వైట్‌హౌస్ సైబర్ సెక్యూరిటీ సలహాదారును తొలగించటం.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉందనే వాదనలను ఆయన తేలిగ్గా తీసుకోవటంపై విమర్శలు వస్తున్నాయి. తాజా సైబర్ దాడికి కారణం చైనా అంటూ అధ్యక్షుడు ట్రంప్ కొత్త వాదన లేవనెత్తడం ప్రశ్నార్థకమౌతోంది. ఈ హ్యాకింగ్ వెనుక ఉన్నది రష్యాయే అనేది సుస్పష్టమని ఆ దేశ రక్షణ మంత్రి మైక్ పాంపియో ప్రకటించిన అనంతరం.. ట్రంప్ ఈ ప్రకటన చేయటం గమనార్హం.
ఇవీ చదవండి
అగ్రరాజ్యానికి పెను ముప్పే..
భారతీయులే లక్ష్యంగా చైనా హ్యాకర్లు..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.