Updated : 08 Dec 2020 01:01 IST

వైభవంగా ఘంటసాల జయంతి వేడుకలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 98వ జయంతి వేడుకలను అంతర్జాలం వేదికగా రెండు రోజులుపాటు వైభవంగా నిర్వహించారు. సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంశీ ఇంటర్నేషనల్,  శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం, శారద కళాసమితి  సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్‌ 4, 5 తేదీల్లో రెండవ ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, హాంగ్ కాంగ్, యూకే, దక్షిణాఫ్రికా, అమెరికా తదితర దేశాల్లోని 17 తెలుగు సంస్థలు కార్యక్రమంలో పాల్గొన్నాయి.  

డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం ఘంటసాల కుమార్తె సుగుణ, కుమారుడు ఘంటసాల రత్నకుమార్ జ్యోతి ప్రజ్వలనం చేసి మొదటిరోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు రమణాచారి ప్రారంభోపన్యాసం చేశారు. సింగపూర్ నుంచి శేషశ్రీ వేదుల ప్రార్థన గీతం వీణపై వాయించారు. అనంతరం ప్రముఖ సంగీత విద్వాంసులు పట్రాయని సంగీతరావుకి "వంశీ-ఘంటసాల జాతీయ పురస్కారం" ప్రదానం చేశారు. కార్యక్రమానికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, సీనియర్‌ దర్శకుడు రేలంగి నరసింహారావు, సీనియర్‌ నటి జమున, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్రాయని సంగీతరావు మాట్లాడుతూ ఘంటసాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఘంటసాల పేరుతో తనకు పురస్కారం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

డిసెంబర్ 5వ తేదీన ఘంటసాల మనవరాలు వాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భారత్, ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్, అమెరికా, నెదర్లాండ్స్‌ దేశాల నుంచి సుమారు 160 మంది చిన్నారులు, యువతీ యువకులు 12 గంటల పాటు నిర్విరామంగా ఘంటసాల పాటలను ఆలపించి రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. సినీ గేయ రచయిత భువనచంద్ర, వంగూరి చిట్టెన్ రాజు, జయ పీసపాటి, డాక్టర్ అచ్చయ్య రావు, సీతారామరాజు, శ్రీలత, నరేంద్ర స్వామి, సంజీవ నరసింహప్పడు తదితరులు రికార్డు నెలకొల్పిన చిన్నారులను అభినందించారు. సంగీత సాహిత్య సమ్మేళనానికి సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంశీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళా సారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం వ్యవస్థాపక అధ్యక్షురాలు రాధికా మంగిపూడి, గాయని దివాకర్ల సురేఖ మూర్తి, శారద కళాసమితి అధ్యక్షుడు దోగిపర్తి శంకర్రావు ముఖ్య నిర్వాహకులుగా వ్యవహరించారు.

కార్యక్రమంలో కొమాండూరి రామాచారి, నేమాని పార్థసారథి, శశికళ స్వామి, తిరుమల శ్రీనిధి, వారణాసి శ్రీ సౌమ్య, హోసూరు హేమవతి, వి.కె.దుర్గ, డాక్టర్ ద్వారం త్యాగరాజు, భువనగిరి విజయలక్ష్మి, కె.విద్యాసాగర్, చాగంటి రాజ్యలక్ష్మి, దేవేంద్రం కృతిక, డాక్టర్ పద్మ మల్లెల, కాపవరపు విద్యాధరి, యడవల్లి శేషు కుమారి, సీహెచ్ షర్మిల, పాచంటి హర్షిణి, కీర్తిక మంగు, శరత్ బాబు, కన్నారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని