
అమెరికాలో కదం తొక్కిన ప్రవాస భారతీయులు!
26/11 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలోని పాక్ దౌత్య కార్యాలయం ఎదుట ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు. 26/11 ముంబయి దాడులకు కారణమైన వారిని శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రవాస భారతీయులు గురువారం బ్యానర్లు, ప్లకార్డులతో ఆందోళన చేపట్టగా.. ఇతర దేశాలకు చెందినవారు కూడా ఈ కార్యక్రమానికి మద్దతుగా పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయం నుంచి టైమ్స్స్క్వేర్కు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు భారత్, అమెరికా జెండాలను పట్టుకొని ప్రదర్శనగా ముందుకు సాగారు. ‘పాక్.. ఉగ్రవాదం మానుకో’, ‘ఉగ్రవాదానికి ఎదురొడ్డి నిలవండి’ ‘ఉగ్రవాదం వద్దని చెప్పండి’, ‘మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’.. అంటూ నినదించారు. ముంబయిలో ఉగ్రదాడి జరిగి 12 ఏళ్లు దాటినా.. అందుకు బాధ్యులను పాకిస్థాన్ ప్రభుత్వం శిక్షించలేదని మండిపడ్డారు. ఈ ఆందోళన సందర్భంగా పాక్ దౌత్య కార్యాలయం బయట డిజిటల్ వ్యాన్లను ఏర్పాటు చేసి నాటి ఉగ్రదాడి దృశ్యాలను ప్రదర్శించారు. అలాగే, అమెరికాలోని ఇతర నగరాల్లోనూ ఇలాంటి ప్రదర్శన నిర్వహించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.