Published : 23/11/2020 00:35 IST

మహిళను పట్టాలపైకి తోసిన భారతీయుడి అరెస్ట్‌

న్యూయార్క్‌: రైలు స్టేషన్‌కు సమీపిస్తోన్న సమయంలో, ఓ మహిళను పట్టాలపైకి తోసివేసిన ఘటన అమెరికా‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన వ్యక్తిని న్యూయార్క్‌ పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన అమెరికా పోలీసులు.. పూర్తి దర్యాప్తు చేపట్టారు. ఈ చర్యకు పాల్పడింది భారత్‌కు చెందిన ఆదిత్య వేములపాటి(24)గా గుర్తించారు.

నగరంలోని యూనియన్‌ స్క్వేర్‌ సబ్‌వే స్టేషన్‌లో ఓ అమెరికన్‌ మహిళ రైలు కోసం వేచి చూస్తోంది. రైలు సమీపిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఆదిత్య ఆ మహిళను ఒక్కసారిగా ట్రాక్‌ మీదకు తోసేశాడు. వెంటనే అప్రమత్తమైన మహిళ, పట్టాలపై నుంచి బయటపడింది. కొద్దిసేపు రెండు ట్రాక్‌ల మధ్యే ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు బాధిత మహిళను ఆసుపత్రికి తరలించి, అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా దృశ్యాలు స్టేషనల్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే ఆ యువకుడు మహిళను పట్టాలపైకి తోసివేసినట్లు న్యూయార్క్‌ పోలీసులు అనుమానించారు. అయితే, ఆదిత్యను ప్రశ్నించిన అనంతరం, అతను తీవ్ర మానసిక ఒత్తిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా డిసెంబర్‌ 4వరకు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశించింది.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని