Updated : 23/10/2020 15:24 IST

అమెరికాలో భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

వాషింగ్టన్‌: అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బోస్టన్‌‌, వాషింగ్టన్‌, హ్యూస్టన్‌, నెవార్క్‌, నాష్విల్లే, పిట్స్‌బర్గ్‌, హ్యారిస్‌బర్గ్‌ ప్రాంతాల నుంచి వీరిని అరెస్టు చేశారు. వీరంతా ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)’ అనే వెసులుబాటుని ఉపయోగించుకొని అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్లు ‘ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌’(ఐసీఈ) అధికారులు ఆరోపించారు. విద్యార్థులు చదివిన రంగంలో ఒక ఏడాది పాటు పనిచేసే అవకాశం ఓపీటీ కల్పిస్తుంది. స్టెమ్‌ ఓపీటీలో పాల్గొన్నట్లయితే మరో 24 నెలలు పనిచేయొచ్చు. కానీ, వీరంతా ఎక్కడా ఉద్యోగం చేయకుండానే ఓపీటీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు అధికారులు ఆరోపించారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని