Updated : 17/11/2020 20:19 IST

మన విద్యార్థులు అమెరికాకు చెల్లించేదెంతో తెలుసా?

వాషింగ్టన్‌: అమెరికాలో చదువుకోవడం విద్యార్థుల కల. దానికి అనుగుణంగా ఏటా లక్షలమంది విద్యార్థులను ఆ దేశం ఆహ్వానిస్తుంటుంది. తద్వారా విద్యార్థులు జీడీపీ వృద్ధికి కూడా దోహదపడుతున్నారు. భారత్‌తోపాటు చైనా, జపాన్‌, దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి లక్షల మంది విద్యార్థలు అక్కడకి వెళ్తుంటారు. అయితే,  2019-20 విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 7.6 బిలియన్‌ డాలర్లు సమకూరినట్లు ఓ నివేదికలో వెల్లడైంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్య 4.4 శాతం తగ్గినప్పటికీ ఇంత మొత్తంలో ఆదాయం సమకూర్చడం గమనార్హం. భారత్‌ నుంచి 1,93,124 మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం గత ఏడాది అమెరికాకు వెళ్లారు.

అత్యధికంగా చైనా వల్ల ఎక్కువ రాబడి వచ్చినట్లు నివేదిక తేల్చింది. వరుసగా 16వ ఏడాది చైనా విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు ‘‘ ఓపెన్‌ డోర్స్ 2020’’ నివేదికలో వెల్లడైంది. తాజా విద్యా సంవత్సరంలో 3,72,000 మంది చైనా విద్యార్థులు అమెరికాకు వచ్చినట్లు పేర్కొంది. అమెరికా విద్య, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, ఇన్‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఐఐఈ) విడుదల చేసిన వివరాల మేరకు ఏటా 10 లక్షల పైచిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్తుంటారు. 2019 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ విద్యార్థుల వల్ల అమెరికాకు 44 బిలియన్‌ డాలర్ల సమకూరుతుంటే అందులో భారతీయ విద్యార్థుల ద్వారా 7.69 బిలియన్‌ డాలర్లు వస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ వెల్లడించింది.

‘‘వరుసగా 5 ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులను ఆమెరికాకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. కరోనా వ్యాప్తి సమయంలోనూ ఈ రికార్డు సాధించాం’’ అని అమెరికా విద్య, సాంస్కృతిక శాఖ మంత్రి రోయ్‌సీ వెల్లడించారు. విద్యార్థులు తమ ఉన్నత విద్య కోసం అమెరికాను ఎంచుకోవడం అభినందనీయమన్నారు. జీవితంలో అభివృద్ధి చెందాలటే చదువు ఎంతో ముఖ్యమని, యువత కలలను సాకారం చేసుకునేందుకు ఇది అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు. విద్యార్థులు అమెరికాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి నైపుణ్యాలతో కూడిన చదువును అందిస్తున్నామని తెలిపారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని