Updated : 26/10/2020 23:15 IST

భారత్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలు.. మండిపడ్డ బైడెన్‌

భారత్‌తో‌ సంబంధాలు ఎంతో విలువైనవి: డెమొక్రాట్‌ నేత

వాషింగ్టన్‌: గాలి కాలుష్యంపై స్పందిస్తూ భారత్‌ మురికి దేశమంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌ మండిపడ్డారు. మిత్రులతో మాట్లాడాల్సిన పద్ధతి అదికాదన్నారు. ‘అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ దేశాన్ని మురికిగా పిలిచారు. మన స్నేహితుల గురించి మాట్లాడే తీరు ఇది కాదు. వాతావరణ మార్పు వంటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే మార్గం కూడా ఇది కాదు’అని ట్విటర్‌లో పేర్కొన్నారు.  నేను, కమలా హారిస్‌ భారత్‌తో అమెరికా  భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తాం. అంతేకాకుండా అమెరికా విదేశాంగ విధానాన్ని తిరిగి గౌరవప్రద స్థానంలో ఉంచుతామని జో బైడెన్‌ స్పష్టంచేశారు.

‘ఒబామా-బైడెన్‌ ప్రభుత్వ హయాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్‌-అమెరికా దేశాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాం. అదే తరహాలో బైడెన్‌-హారిస్‌ పాలనలో మరింత ఎక్కువ భాగస్వామ్యంతో అమెరికా-భారత్‌ సంబంధాలు కొనసాగిస్తాం’ అని డెమొక్రాటిక్‌ నేత బైడెన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇదిలాఉంటే, ఓవైపు తమకు మిత్రదేశం అంటున్న ట్రంప్‌ మరోవైపు భారత్‌పై నోరు పారేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం పెరుగుదలకు భారత్, రష్యా, చైనా దేశాలు కారణమంటూ అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో ట్రంప్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఆ సందర్భంలో ‘భారత్‌ వైపు చూడండి.. అక్కడి మురికి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా మిత్రదేశాన్ని కూడా తీవ్రంగా విమర్శించడంపై అక్కడి డెమొక్రాట్లు విరుచుకుపడుతున్నారు.


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని