Updated : 22/12/2020 10:53 IST

మోదీకి అమెరికా ప్రసిద్ధ పురస్కారం

వాషింగ్టన్‌: ప్రధాని మోదీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు చేరింది. అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘లెజియన్‌ ఆఫ్‌ మెరిట్’‌ను మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం బహూకరించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రయాన్‌ చేతుల మీదుగా.. మోదీ తరఫున అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు ఈ అవార్డును స్వీకరించారు.

భారత్‌-అమెరికా వ్యూహాత్మక బంధాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన చొరవకుగానూ ఆయనకు ఈ అవార్డు బహూకరించినట్లు ఓబ్రయాన్‌ తెలిపారు. దీంతో ఈ అవార్డు కింద దేశాధినేతలకు ఇచ్చే చీఫ్ కమాండర్‌ హోదా మోదీని వరించింది. మోదీతో పాటు ఈ అవార్డును ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకూ బహూకరించారు. సైన్యంతో పాటు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి కృషి చేసిన దేశాధినేతలకు అమెరికా ఈ అవార్డును అందిస్తుంటుంది.

మోదీకి గతంలోనూ పలు దేశాల ఆయా దేశాల అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. 2016లో సౌదీ అరేబియా.. అబ్దులాజిజ్‌ అల్‌ సౌద్‌ అవార్డు, అఫ్గానిస్థాన్‌ నుంచి అమీర్‌ అబ్దుల్లా ఖాన్‌ అవార్డు, సియోల్‌ పీస్‌ ప్రైజ్‌-2018, రష్యా నుంచి ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపోజిల్‌ అవార్డు, యూఏఈ నుంచి జాయెద్‌ మెడల్‌ను అందుకున్నారు.

ఇవీ చదవండి..

కరోనా టీకా తీసుకున్న జో బైడెన్‌

ట్రంప్‌ సార్‌.. ఇంకెప్పుడు?


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని