Published : 10/10/2020 17:42 IST

ఎన్నారై మెడికల్‌ కోటాపై సుప్రీం కీలక తీర్పు

దిల్లీ: ప్రైవేటు పీజీ వైద్య విద్యా కళాశాలల్లో ప్రవాస భారతీయుల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు అతి ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఎన్నారైలకు సదరు కోటా కింద సీట్లు కేటాయించి తీరాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ప్రైవేటు పీజీ వైద్య కళాశాలల్లో రిజర్వేషన్లు ఎన్నారై అభ్యర్థులు హక్కు కాదని.. వారికి సీట్లు  కేటాయించాలా? వద్దా? అనేది ఆయా సంస్థల స్వతంత్ర నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. 

నీట్‌ పీజీ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ అడ్మిషన్‌ బోర్డు ఎన్నారై కోటాను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నారై అభ్యర్థులకు కోటా ప్రకారం కాకుండా వారి వారి అర్హతల ప్రకారం సీట్లు కేటాయిస్తామని కూడా బోర్డు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఇద్దరు విద్యార్థులు సవాలు చేసిన నేపథ్యంలో సుప్రీం, పై తీర్పును వెలువరించింది.

‘‘ఏ విద్యా సంవత్సరంలోనైనా ఎన్నారై కోటా ఉల్లంఘించరానిదేమీ కాదు. అయితే ఏదైనా విద్యా సంస్థ లేదా రాష్ట్ర స్థాయి అధికారిక సంస్థ ఆ కోటాను రద్దు చేయాలని భావించినప్పుడు.. ఆ నిర్ణయానికి వచ్చేందుకు గల సహేతుకమైన కారణాలను తెలుపుతూ ప్రకటనను విడుదల చేయాలి. ఈ చర్య అభ్యర్థులు ఇతర చోట్ల సీట్లను కోల్పోకుండా ఉండేందుకు సహాయకారి కాగలదు.’’ అని న్యాయమూర్తులు ఎల్‌ నాగేశ్వర రావు, ఎస్‌ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని