
అమెరికా నుంచి కనీసం రెండు టీకాలు!:ఫౌచీ
ఫైజర్ ఫలితాలపై ప్రశంస
వాషింగ్టన్: కొవిడ్-19 నివారణ కోసం ఫైజర్ సంస్థ రూపొందించిన టీకా పురోగతిపై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ప్రశంసలు కురిపించారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. అలాగే, అమెరికా నుంచి కనీసం రెండు విజయవంతమైన టీకాలు అందుబాటులో ఉండొచ్చని ఫౌచీ అభిప్రాయపడినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది.
‘టీకా ప్రయోగ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం అసాధారణంగా ఉన్నాయి’ అని ఫౌచీ వ్యాఖ్యానించారు. మెడెర్నా టీకా నుంచి కూడా ఇదే ఫలితం వస్తుందని ఈ ఫలితాలు వెల్లడిచేస్తున్నాయన్నారు. ఎందుకంటే, రెండింటి అభివృద్ధిలో ఒకేరకమైన సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించారు. ‘మనకు కనీసం రెండు టీకాలు ఉండొచ్చని మేం ఆశిస్తున్నాం’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, ఫైజర్, బయో ఎన్టెక్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన టీకా 90 శాతం మేర సమర్థంగా పనిచేస్తోంది. ప్రస్తుతం సాగుతున్న మూడో దశ ప్రయోగాల్లో ఈ మేరకు ప్రాథమికంగా వెల్లడైనట్లు రెండు సంస్థలు సోమవారం ఓ ప్రకటనలో తెలిపాయి. అత్యవసర వినియోగం కింద ఈ టీకాను అనుమతించాలని ఈ నెలాఖరులో అమెరికా, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ)కు దరఖాస్తు చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.