
న్యూయార్క్‌లో గాంధీ విగ్రహం
న్యూయార్క్: అమెరికాలోని అతివాద మూకలు గాంధీ విగ్రహాల విధ్వంసానికి పాల్పడుతున్న నేపథ్యంలో న్యూయార్క్ రాష్ట్రంలోని ఓ చిన్న పట్టణం భారత జాతిపిత పట్ల తన భక్తిప్రపత్తులను చాటుకుంది. శాంతి, అహింసలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడంలో మహాత్ముడి పాత్రకు గుర్తుగా పట్టణంలో ఓ చక్కటి విగ్రహాన్ని నెలకొల్పింది. ఇక్కడి అంహెర్సెట్ పట్టణ పౌరులు గాంధీ జయంతి రోజున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణ్‌ధీర్ జైస్వాల్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గాంధీ విగ్రహాలను రూపొందించటంలో పేరెన్నిక గన్న శిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు. చిరస్మరణీయమైన గాంధీ సిద్ధాంతాలకు తమ పట్టణంలో ఓ భౌతిక రూపం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యను చేపట్టినట్టు.. కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా డైరక్టర్ సిబు నాయర్ తెలిపారు. గాంధీ విగ్రహ నిర్మాణానికి గాను తాము 40వేల డాలర్లు విరాళాల రూపంలో సేకరించినట్టు ఆయన వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.