Published : 19 Aug 2020 15:55 IST

తానా ఫొటో కవితల పోటీ విజేతలు వీరే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ ఫొటోగ్రఫీ (ఆగస్టు 19)ని పురస్కరించుకుని తానా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటో కవితల పోటీలో విజయవాడకు చెందిన బండ్ల మాధవరావు ప్రథమ బహుమతి సాధించారు. విజేతకు నగదు పురస్కారం కింద రూ.30వేలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సింధు రావులపాటి, కె.వి మన్ ప్రీతం ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి రూ.20 వేలు, రూ.10వేలు చొప్పున నగదు అందజేయనున్నారు. వీరితో పాటు ఉత్తమ కవితలు పంపిన మరో 10 మందికి రూ.4వేలు చొప్పున బహుమతి ప్రదానం చేయనున్నారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు విశేష స్పందన లభించిందని తానా అధ్యక్షుడు జయ శేఖర్‌ తాళ్లూరి తెలిపారు. కవులు, రచయితలు, తెలుగు భాషాభిమానులు ప్రోత్సహించే ఉద్దేశంతో తానా మాజీ అధ్యక్షులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర సారథ్యంలో ఏర్పాటు చేసిన ఈ వేదిక వినూత్న కార్యక్రమాలతో దూసుకెళుతుండడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయంలో సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌ కృషి ప్రశంసనీయమని కొనియాడారు. 

ఫొటో కవితల పోటీలకు రైతులు ధాన్యాన్ని తూర్పరాబోస్తున్న ఓ చిత్రం, కిక్కిరిసిన భవనాలతో కూడిన నగర జీవితానికి సంబంధించిన మరో చిత్రం ఇచ్చి సమన్వయ పరుస్తూ 20 పంక్తులకు మించకుండా కవితలు రాయమని కోరామని తానా ప్రపంచ సాహిత్య వేదిక సంచాలకులు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర చెప్పారు. లక్ష రూపాయలు బహుమానంగా ప్రకటించగా వివిధ దేశాల నుంచి 1,606 మంది కవులు ఈ పోటీలో పాల్గొన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఫోటోగ్రాఫర్ టి.శ్రీనివాస రెడ్డి ఈ చిత్రాలను అందించారన్నారు. కిరణ్ ప్రభ, క్రాంతి శ్రీనివాస్, డాక్టర్‌ కామరాజు రమణ రావు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని తెలిపారు. వీరికి ప్రసాద్‌ తోటకూర కృతజ్ఞతలు తెలిపారు. గతంలో నిర్వహించిన ‘నాన్నా నీకు నమస్కారం’ కవితల పోటీల కంటే ఇప్పుడు అధిక సంఖ్యలో కవులు ఈ పోటీలో పాల్గొన్నారని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌ అన్నారు. భవిష్యత్‌లో తానా నిర్వహించే కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని రచయితలను ఆహ్వానించారు.

విజేతలు వీరే..

ప్రథమ బహుమతి: బండ్ల మాధవరావు (విజయవాడ, ఏపీ)

ద్వితీయ బహుమతి: సింధు రావులపాటి (కమ్మింగ్, జార్జియా, అమెరికా)

తృతీయ బహుమతి:  కె.వి.మన్ ప్రీతం (విద్యానగర్, జగిత్యాల, తెలంగాణ)

₹4 వేలు బహుమతి పొందిన విజేతలు

1. గౌతం లింగా (దక్షిణాఫ్రికా)

2. డాక్టర్‌ జ్యోత్స్న ఫణిజ (న్యూదిల్లీ)

3. వెంకటేశ్‌ పువ్వాడ (బెంగళూరు)

4. ప్రొఫెసర్ రామా చంద్రమౌళి (వరంగల్‌)

5. అమరజ్యోతి (అనకాపల్లి)

6. బండారి రాజ్ కుమార్ (గాంధీ నగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి)

7. డి.నాగజ్యోతి శేఖర్ (మురమళ్ళ, తూ.గో.)

8. జయశ్రీ మువ్వా (ఖమ్మం)

9. పాయల మురళీకృష్ణ (విజయనగరం)

10. తండా హరీశ్‌ గౌడ్  (గూడురు, మహబూబాబాద్‌)

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts