Updated : 03 Oct 2020 09:30 IST

ఆస్పత్రిలో చేరిన ట్రంప్‌

ఆయన తీసుకుంటున్న ఔషధాలివే..

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆస్పత్రిలో చేరారు. వాషింగ్టన్‌ శివారు ప్రాంతం బేథెస్డాలో ఉన్న వాల్టర్‌ రీడ్‌ మిలిటరీ ఆస్పత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. తనకు వైరస్‌ సోకినట్లు ప్రకటించినప్పటి నుంచి శ్వేతసౌధంలోనే క్వారంటైన్‌లో ఉన్న ఆయన వైద్యుల సూచన మేరకు శుక్రవారం సాయంత్రం ఆస్పత్రిలో చేరేందుకు అంగీకరించారు. మాస్కు ధరించి హెలికాప్టర్‌లో ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి నుంచే ఆయన విధులు నిర్వర్తించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉండే అవకాశం ఉందన్నారు. 

నేను ఆరోగ్యంగానే ఉన్నా..

తాను, ప్రథమ మహిళ మెలనియా ట్రంప్‌ ఆరోగ్యంగానే ఉన్నట్లు ట్రంప్‌ తెలిపారు. వాల్టర్‌ రీడ్‌కు చేరుకునే ముందు 18 సెకన్ల నిడివి గల ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. ‘‘నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. నేను వాల్టర్ రీడ్‌ ఆస్పత్రికి వెళ్తున్నాను. నాకు తెలిసి నేను బాగానే ఉన్నాను. అయినా, అన్నీ సవ్యంగా ఉండాలనే మేం ఆస్పత్రికి వెళ్తున్నాం. ప్రథమ మహిళ కూడా బాగానే ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను’’ అని వీడియో సందేశంలో ట్రంప్‌ అన్నారు. 

ట్రంప్‌ తీసుకుంటున్న ఔషధాలివే..

కొవిడ్‌-19 నుంచి బయటపడేందుకు ట్రంప్‌ తీసుకుంటున్న ఔషధాల జాబితాను ఆయన వ్యక్తిగత వైద్యుడు డా.సీన్‌ కాన్లే వెల్లడించారు. ‘‘అధ్యక్షుడికి వైరస్‌ సోకినట్లు పీసీఆర్‌లో నిర్ధారణ అయిన తర్వాత, ముందు జాగ్రత్తగా రెజెనెరాన్స్‌కు చెందిన 8 గ్రాముల డోసు గల పాలీక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ తీసుకున్నారు. దీంతోపాటు జింక్‌, విటమిన్‌-డి, ఫామోనిటిడైన్‌, ఆస్పిరిన్‌, మెలటోనిన్‌ తీసుకుంటున్నారు’’ అని ఓ ప్రకటనలో తెలిపారు. పాలీక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉండడం గమనార్హం. ఇది కొవిడ్‌ లక్షణాలు మరింత ముదరకుండా రక్షిస్తుందని భావిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి కొంత అలసినట్లు కనిపించినా.. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. వైద్యనిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందన్నారు. తదుపరి తీసుకోవాల్సిన అత్యుత్తమ చికిత్సా విధానాలను ఎప్పటికప్పుడు సిఫార్సు చేస్తుందన్నారు. ప్రథమ మహిళకు స్వల్ప తలనొప్పి, దగ్గు మినహా పెద్ద లక్షణాలేమీ లేవని తెలిపారు. మిగతా కుటుంబ సభ్యులందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు.

ట్రంప్‌ కోలుకోవాలని కిమ్ ఆకాంక్ష..

ట్రంప్‌ దంపతులు కరోనా నుంచి త్వరగా బయటపడాలంటూ ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వ్యక్తం అవుతోంది. తాజాగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సైతం ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘ట్రంప్‌ దంపతుల ఆరోగ్యం పట్ల కిమ్‌ సానుభూతి వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా వాళ్లు దీని నుంచి బయటపడతారని ఆకాంక్షించారు. త్వరలో వారు కరోనాను కచ్చితంగా జయిస్తారన్నారు’’ అని అక్కడి అధికారిక మీడియా కేసీఎన్‌ఏ ప్రకటన విడదల చేసింది. ఇప్పటికే ప్రపంచ దేశాల అధినేతలు ట్రంప్‌ దంపతుల ఆరోగ్యంపై సానుభూతి సందేశాలు పంపిన విషయం తెలిసిందే. 

ఇవీ చదవండి..

ట్రంప్‌ దంపతులకు కొవిడ్‌ పాజిటివ్‌

కరోనా కథ మార్చేనా..!Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని