
శ్వేతసౌధంలో ‘ట్రంప్’ నాణేల అమ్మకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌హౌస్ ‘‘ట్రంప్ డిఫీట్స్ కొవిడ్’’ (ట్రంప్ కొవిడ్‌ను జయించారు) అనే పేరుతో స్మారక నాణేల విక్రయాన్ని చేపట్టింది. కొవిడ్ సోకిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి తిరిగి శ్వేతసౌధానికి వచ్చిన సందర్భంగా ఈ చర్య ప్రాముఖ్యం సంతరించుకుంది. శ్వేతసౌధంలోని అధికారిక విక్రయశాల ‘వైట్‌హౌస్ గిఫ్ట్ షాప్’ ఈ విషయాన్ని ప్రకటించింది. పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే ఈ నాణెం విక్రయాలు స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6:30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి.
అయితే 100 డాలర్ల విలువ గల ఈ నాణెం పంపిణీ నవంబర్ 14నుంచి మొదలవుతుందని దీని రూపశిల్పి, వైట్‌హౌస్ గిఫ్ట్ షాప్ ఛైర్మన్ ఆంథోని గియాన్నిని తెలిపారు. ఈ నాణేల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం కరోనా నివారణకు, క్యాన్సర్ బాధితుల చికిత్సకు అందచేస్తామని ఆయన వెల్లడించారు. ఇది ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో విడుదలయ్యే ఆఖరి స్మారక నాణెమని ఆంథొనీ అన్నారు. అయితే ఈ నాణెం నమూనా కానీ చిత్రాలు కానీ వెల్లడి కాలేదు. కాగా ట్రంప్‌కు బాక్సింగ్ అంటే ఇష్టం కనుక ఈ కొత్త నాణెం అధ్యక్షుడి ఓ సూపర్ హీరో లక్షణాన్ని కలిగి ఉంటుందని ఆయన సూచన ప్రాయంగా చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.