Published : 30/09/2020 14:28 IST

కొవిడ్‌ మరణాల్లో భారత్‌ది తప్పుడు లెక్క: ట్రంప్‌ 

క్లీవ్‌లాండ్‌: అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చ సందర్భంగా.. కరోనా విషయంలో డెమొక్రాటిక్‌  అభ్యర్థి జో బైడెన్‌, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఏ ప్రణాళిక లేని ట్రంప్‌ వైఖరి పలువురు అమెరికన్ల ప్రాణాలు తీసిందని బైడెన్‌ విరుచుకుపడ్డారు. కాగా, అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తక్కువే అని.. భారత్‌ తదితర దేశాలు మరణాలకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపుతున్నాయని ట్రంప్‌ అన్నారు.

చర్చలో భాగంగా బైడెన్‌ మాట్లాడుతూ ఏడు మిలియన్ల అమెరికన్‌ ప్రజలకు కరోనా వైరస్‌ సోకిందని.. అయితే అధ్యక్షుడికి ఈ విషయంలో ఏ ప్రణాళిక లేదని విమర్శించారు. ‘‘మీలో ఎందరికి ఉదయం లేవగానే మీ ప్రియమైన వారు కొవిడ్‌ కారణంగా మరణించటంతో ఖాళీ అయిన డైనింగ్‌ టేబుల్‌  కుర్చీ చూడాల్సి వస్తోంది?’’ అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ అధ్యక్ష పదవి ఒక్క పర్యాయానికే పరిమితం అనే బైడెన్‌ వ్యాఖ్యలకు ట్రంప్‌ చురుగ్గా స్పందించారు.

‘‘కొవిడ్‌-19 చైనా తప్పిదం.. అలా జరిగి ఉండకూడదు. మన దేశంలో కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువ. అయితే మా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుండా ఉంటే ఈ పాటికి అనేక మిలియన్ల మంది మరణించి ఉండేవారు. ఇక గణాంకాల విషయానికి వస్తే.. భారత్‌, చైనా, రష్యాలలో ఎన్ని కరోనా వైరస్‌ మరణాలు సంభవించాయనే వివరాలు మీకు తెలియదు. ఆ దేశాలు కచ్చితమైన గణాంకాలను వెల్లడించవు. అసలు ప్రతిపక్షమైన డెమొక్రాటిక్‌  గవర్నర్లే కొవిడ్‌-19 విషయంలో నేను చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించానంటూ మెచ్చుకున్నారు. వ్యాక్సిన్‌కు మనం కేవలం కొన్ని వారాల దూరంలో మాత్రమే ఉన్నాం.’’ అని ఆయన జవాబిచ్చారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని