
రివర్స్ గేర్‌లో డొనాల్డ్ ట్రంప్!
కాదంటేనే కలసొస్తుందంటున్న అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. డెమొక్రాటిక్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఫిలడెల్ఫియాలో నిర్వహించిన ప్రచార సభలో ట్రంప్‌ను పదవి నుంచి దించాలని.. జో బైడెన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. కాగా ఈ వ్యాఖ్యలపై ట్రంప్ ఎదురుదాడికి దిగారు. ఒబామా ప్రత్యర్థి తరపున ప్రచారం చేయటం తనకు కలసి వస్తుందన్నారు. అసలు ఒబామా విఫలమవ్వడంతోనే తనను ప్రజలు శ్వేతసౌధానికి పంపారని ఆయన ఎద్దేవా చేశారు.
ఉత్తర కరోలినాలో ప్రచారం సందర్భంగా ఒబామా గతంలో హిల్లరీ క్లింటన్ తరపున భారీగా ప్రచారం చేసిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. ఆ మాజీ అధ్యక్షుడు, తన ప్రత్యర్థి బైడెన్ తరపున ప్రచారం చేయటం తనకు శుభవార్తే అని ఆయన వెల్లడించారు. ‘‘మొదట ఒబామా నేను పోటీలో నిలబడను అని అన్నారు.. నేను నిలబడ్డాను. నాకు నామినేషన్ దక్కదు అన్నారు.. కానీ నాకు నామినేషన్ లభించింది. నన్ను అధ్యక్షుడు కాలేవు అన్నారు.. నేను గెలిచాను. అప్పుడు ఓడిపోయిన హిల్లరీ కంటే కూడా ఈ బరాక్ హుస్సేన్ ఒబామా విచారించారు. అతనే బరాక్ హుస్సేన్ ఒబామా..’’ అంటూ వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.