Updated : 13/10/2020 09:49 IST

ట్రంప్‌నకు కరోనా నెగెటివ్‌!

వెల్లడించిన శ్వేతసౌధం వైద్యుడు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా నుంచి కోలుకున్నట్లు శ్వేతసౌధం వైద్యుడు డాక్టర్‌ సియాన్‌ కాన్లే వెల్లడించారు. వరుస రోజుల్లో జరిపిన నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఆ పరీక్షలు ఎప్పుడు జరిపారన్నది మాత్రం వెల్లడించలేదు. పైగా ఆయనకు నిర్వహించింది యాంటిజెన్‌ పరీక్షలని తెలిపారు. ఆర్‌టీపీసీఆర్‌తో పోలిస్తే యాంటిజెన్‌ పరీక్షల ఫలితాలు అంత కచ్చితత్వంతో ఉండవన్న విషయం తెలిసిందే. చికిత్స అనంతరం ట్రంప్‌ తొలిసారి నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కొన్ని గంటల ముందు ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ‘‘వరుసగా నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలింది. అలాగే వైరల్‌ లోడ్‌, సబ్‌జీనోమిక్‌ ఆర్‌ఎన్‌ఏ, పీసీఆర్‌ సైకిల్‌ థ్రెశోల్డ్‌ మెజర్‌మెంట్స్‌ వంటి వైద్య పరీక్షల్ని సైతం పరిగణనలోకి తీసుకున్నాం. వీటన్నింటిని బట్టి ఆయన(ట్రంప్‌)లో వైరస్‌ క్రియాశీలకంగా లేదని గుర్తించాం’’ అని కాన్లే తన ప్రకటనలో వెల్లడించారు. 

తనకు కరోనా సోకినట్లు ట్రంప్‌ అక్టోబర్‌ 2న వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ సైతం వైరస్ బారిన పడ్డారు. వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆస్పత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందారు. అనంతరం శ్వేతసౌధం చేరుకున్న ఆయన అక్కడే చికిత్స కొనసాగించారు. శుక్రవారంతో చికిత్స పూర్తి చేసుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. ట్రంప్‌లో క్రియాశీలక వైరస్‌ లేదని.. ఆయన నుంచి ఎవరికీ వైరస్‌ సోకే ప్రమాదం లేదని తెలిపారు. అనంతరం శనివారం శ్వేతసౌధంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నేరుగా పాల్గొని ప్రసంగించారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని