Published : 05/11/2020 01:16 IST

అమెరికా: వందేళ్లలోనే అత్యధిక పోలింగ్‌..!

67 శాతం నమోదైనట్లు అంచనా..

వాషింగ్టన్‌: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఆసక్తిగా మారాయి. అంతేకాకుండా, గడిచిన వంద సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత పోలింగ్‌ ఈసారి నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో మొత్తం అర్హులైన ఓటర్ల సంఖ్య 23.9 కోట్లు కాగా వీరిలో దాదాపు 10 కోట్లకుపైగా ఓటర్లు ముందస్తుగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల రోజున దాదాపు 6 కోట్ల మంది ఓటు వేసినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి 16 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. మొత్తం ఓట్లలో ఇది దాదాపు 67శాతం. ఈస్థాయిలో ఓటింగ్‌ నమోదుకావడం గడిచిన వందేళ్లలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది. 1908 సంవత్సరంలో అత్యధికంగా 65.7 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం 67శాతం ఓటింగ్‌ నమోదుకాగా, 1900 తర్వాత ఈ స్థాయిలో ఓటింగ్‌ జరగడం ఇదే మొదటిసారి అని ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఎలక్షన్‌ ప్రొజెక్ట్‌’ సంస్థ నిర్వాహకులు మైఖేల్‌ మెక్‌డొనాల్డ్‌ పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ వల్ల ఏర్పడ్డ పరిస్థితులతో ఈసారి ఎక్కువ సంఖ్యలో పోస్టల్‌ ఓట్లకు అనుమతి ఇచ్చారు. దీంతో భారీ స్థాయిలో పోలింగ్‌కు ఇది కూడా దోహదం చేసినట్లు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, కొవిడ్‌ విజృంభణ, జాతి వివక్ష వంటి అంశాలు కూడా ఓటింగ్‌ శాతం పెరగడానికి కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈసారి అమెరికన్‌ ఓటర్లలో డెమొక్రాటిక్‌ పార్టీ మద్దతుదారులు ఎక్కువగా పోస్టల్‌ ఓటింగ్‌ వినియోగించుకోగా, రిపబ్లికన్‌లు మాత్రం పోలింగ్‌ రోజే ఓటు వేసినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఇలా భారీ సంఖ్యలో వచ్చిన పోస్టల్‌ బ్యాలెట్‌లు లెక్కించడం ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ను పోలింగ్‌ తేదీ తర్వాత కొన్ని రోజులపాటు అనుమతిస్తున్నారు. దీంతో లెక్కింపు ప్రక్రియ మరికొన్ని రోజులు సాగే అవకాశం ఉంది.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని